Rare Brain Infection : కేరళలో అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఓ బాలుడు మరణించాడు. కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకి అలప్పుజా జిల్లా తీర ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ శుక్రవారం ప్రకటించారు. అతడికి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (primary amoebic meningoencephalitis) అనే వ్యాధి సోకినట్లు తెలిపారు. కలుషిత నీటిలో స్నానం చేయద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.
Rare Brain Infection Symptoms : పనవళ్లి అనే గ్రామానికి చెందిన అనిల్ కుమార్, షాలిని దంపతుల కుమారుడు గురుదత్ (15) పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల గురుదత్ స్థానికంగా ఉన్న వాగులో స్నానం చేసి అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం నుంచి అలప్పుజా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి బాలుడు చనిపోయాడు.
Naegleria Fowleri Causes : కలుషిత నీటిలో స్వేచ్ఛగా జీవించే నీగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri) అనే రకం అమీబా (బ్రెయిన్ ఈటింగ్ అమీబా).. మనుషుల ముక్కు, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు తెలిపారు. అది మెదడును తీవ్రంగా దెబ్బతీస్తున్నందని చెప్పారు. ఈ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. 1-2 వారాల్లో ఈ లక్షణాలు బయట పడతాయని.. కొన్ని సార్లు మొదట వాసన, రుచి కొల్పోతారని.. ఆ తర్వాత మిగతా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారందరూ మరణించారని వైద్యులు చెప్పారు.
ఇంతకుముందు రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఐదు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. మొదట 2016 బయటపడిందని ఆ తర్వాత 2019, 2020, 2022లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే, తీర ప్రాంతం అలప్పుజా జిల్లాలో ఇది రెండో కేసు. మొదటిది 2017లో నమోదైంది. 'కలుషితమైన నీటిలో స్నానం చేయకూడదు. అపరిశుభ్రమైన నీటితో ముఖం, నోరు కడగడం ఆపాలి. ఎందుకంటే దీని కారణంగానే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకుతుంది" అని అలప్పుజా డీఎమ్ఓ ప్రజలను హెచ్చరించారు.
కేరళలో నోరో వైరస్ కలకలం..
Norovirus Cases In Kerala : ఈ ఏడాది ఆరంభంలో కేరళలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్లో ఇద్దరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకింది. దీంతో వైరస్ వ్యాపించకుండా మూడురోజుల పాటు పాఠశాలను మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.