ETV Bharat / bharat

హెల్ప్ చేయమంటూ ఆమెపై అత్యాచార యత్నం- చితకబాదిన గ్రామస్థులు - నిందితుడిని చితకబాదిన గ్రామస్థులు

Rape Victim: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి చెప్పుల దండ వేసి గ్రామస్థులు దండించిన ఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా బొమ్మనలా గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 55 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

rape victim
నిందితుడిని చెప్పుతో కొడుతున్న మహిళ
author img

By

Published : Dec 15, 2021, 3:45 PM IST

నిందితుడిని చితకబాదుతున్న గ్రామస్థులు

Rape Victim: వివాహితపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు చితకబాదారు. మెడలో చెప్పుల దండ వేసిన స్థానికులు.. చెప్పులతో కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా బొమ్మనలా​ గ్రామంలో బుధవారం జరిగింది.

rape victim
నిందితుడిని చెప్పుతో కొడుతున్న మహిళ

స్థానికుల వివరాల ప్రకారం..

కొప్పళ జిల్లా బొమ్మనలాకు చెందిన నిందితుడు ప్రకాశ్​ పుజారా.. పొలం పనులు చేసుకుంటుండగా అటుగా వెళ్తున్న ఓ వివాహితను బుట్ట ఎత్తేందుకు సాయం అడిగాడు. ఈ క్రమంలో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యాడు. అనంతరం నిందితుడిని వెతికి పట్టుకున్న గ్రామస్థులు పంచాయితీలో ప్రవేశపెట్టారు. బాధితురాలి కుటుంబసభ్యులు, గ్రామస్థులు నిందితుడికి చెప్పులదండ వేసి చితకబాదారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

ఈ ఘటనపై నిందితుడు, గ్రామస్థులు కలిపి మొత్తం 55 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి : సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.