ETV Bharat / bharat

మరదలిపై పోలీసు అత్యాచారం.. ఐదుసార్లు అబార్షన్.. చివరకు ట్విస్ట్ - సీపీఐపై అత్యాచార కేసు

తనపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ యవతి పోలీస్​ అధికారిపై ఫిర్యాదు చేసింది. అయితే మరోసారి స్టేషన్​కు వచ్చిన బాధితురాలు.. ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చింది. అసలేమైందంటే?

Rape case against Challakere CPI
Rape case against Challakere CPI
author img

By

Published : Oct 25, 2022, 11:21 AM IST

Updated : Oct 25, 2022, 11:41 AM IST

వరసకు బావ అయిన ఓ పోలీస్​ అధికారి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తరచూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపిన ఆ యువతి కొద్ది రోజులకే ట్విస్ట్ ఇచ్చింది. అసలేమైందంటే..?
వివరాల్లోకి వెళ్తే... కర్ణాటకలోని చల్లకేరెకి చెందిన సర్కిల్ పోలీస్ ఇన్​స్పెక్టర్(సీపీఐ) ఉమేశ్​పై ఓ యువతి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తరచూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని యువతి ఆరోపించింది. ఫలితంగా తనకు ఐదు సార్లు అబార్షన్ అయ్యిందని తెలిపింది. దీంతో అధికారులు నిందితుడిని విధుల నుంచి తొలగించారు. అయితే ఇప్పుడు ఆ యువతి పోలీస్​ స్టేషన్​కు వచ్చి మరో వాంగ్మూలం ఇచ్చింది. దీంతో కంగుతినడం పోలీసుల వంతైంది.

నిందితుడు ఉమేశ్ తనపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని.. మానసిక ఒత్తిడి కారణంగానే తాను ఇలా ఫిర్యాదు చేశానని యువతి చెప్పుకొచ్చింది. ఉమేశ్ ఆ యువతికి బావ అవుతాడని తెలుస్తోంది. అయితే ఉమేశ్​కు ఇదివరకే రెండు వివాహాలు జరిగాయి. ఈ యువతిని ఇప్పుడు మూడో భార్యగా చేసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నాడని సమాచారం.

ఐదేళ్ల క్రితం దావణగెరె పోలీస్​స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. యువతి కుటుంబ సభ్యులు ఓ భూవివాదాన్ని పరిష్కరించాలని ఉమేశ్​ను ఆశ్రయించారు. అయితే మేనమామ కుమారుడైన ఉమేశ్.. చిత్రదుర్గ నుంచి దావణగెరెకు తనను పిలిపించి అత్యాచారానికి పాల్పడేవాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఒకవేళ తాను వెళ్లకపోతే.. అతడే తన దగ్గరికి వచ్చి అత్యాచారం చేసేవాడని వివరించింది. తన మాట వినకపోతే దావణగెరెలో తమకు ప్లాట్​ రాకుండా అడ్డుకుంటానని సీపీఐ బెదిరించినట్లు తెలిపింది.

బీఈడీ చదువుతున్న సమయంలోనూ తనపై రేప్ చేశాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే తాను ఐదుసార్లు గర్భం దాల్చినట్లు తెలిపింది. అబార్షన్ చేయించుకొని గర్భం తొలగించుకున్నట్లు పేర్కొంది. కాగా, ఇప్పుడు సడెన్​గా వచ్చి బాధితురాలు ట్విస్ట్ ఇచ్చింది. మానసిక ఒత్తిడి వల్లే ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బస్సులో మంటలు చెలరేగి నిద్రలోనే డ్రైవర్ కండక్టర్​ సజీవదహనం

అమ్మాయిని 'ఐటమ్'​ అని పిలిచినందుకు ఏడాదిన్నర జైలు శిక్ష

Last Updated : Oct 25, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.