Rape accused shot dead: అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడ్ని ఓ వ్యక్తి కోర్టు ఆవరణలోనే కాల్చి చంపాడు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన దిల్షాద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు.
ఓ కేసు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు కోర్టు గేటు వద్దకు శుక్రవారం చేరుకున్నాడు దిల్షాద్. అప్పుడే భగవత్ నిషాద్ అనే బీఎస్ఎఫ్ మాజీ జవాన్ దిల్షాద్ను కాల్చి చంపాడు. భగవత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.
ఇదే కారణమా?
2020 ఫిబ్రవరిలో భగవత్ కుమార్తెను దిల్షాద్ కిడ్నాప్ చేశాడు. పోలీసులు ఆమెను కాపాడారు. అప్పుడే అతనిపై అత్యాచారం కేసు కూడా నమోదైంది. తన కూతురిపై అత్యాచారం చేశాడన్న కోపంతోనే నిషాద్.. దిల్షాద్ను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.
యువతిపై సామూహిక అత్యాచారం..
రాజస్థాన్‌లోని జైపుర్‌లో 24 ఏళ్ల యువతిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఓ యువకుడు ఆమెతో సన్నిహితంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ క్రమంలో హోటల్‌కు రావాల్సిందిగా యువతిని ఆ కుర్రాడు కోరాడు. అతడ్ని నమ్మిన ఆ అమ్మాయి హోటల్‌కు వెళ్లింది. దీంతో ఆమెకు మత్తు మందు ఇచ్చి మరో మరో వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
భార్యను కామెంట్ చేశాడని..
భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిని కంటిలో పొడిచాడు మరో వ్యక్తి. ఈ ఘటన దిల్లీలోని ఠాగూర్ గార్డెన్లో జరిగింది. ఈ ఘటనలో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం- ఐదుగురు దుర్మరణం