Ranjan Gogoi Rajya Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన తర్వాత.. విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, రాజ్యసభ సభ్యుడు.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి మాత్రం సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.
Ranjan Gogoi news:
గతేడాది రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యారు. అయితే ఆయన సమావేశాల హాజరు శాతం పదిలోపే ఉంది. ఈ విషయంపై ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ రంజన్ గొగొయి స్పందించారు. తనకు నచ్చినప్పుడే రాజ్యసభ సమావేశాలకు హాజరవుతానని, పార్టీ విప్‌లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
"నన్ను రాజ్యసభకు నామినేట్ చేసినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నాను. అసోం నుంచి వచ్చిన నేను ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై సభలో గళం విప్పాలనే భావించా. కానీ, కరోనా వ్యాప్తి.. వైద్యుల సూచనల మేరకు సమావేశాలకు హాజరుకావట్లేదు. ఈ మేరకు రాజ్యసభకు లేఖ కూడా పంపించాను. అయినా.. నాకు నచ్చినప్పుడు, నేను మాట్లాడాల్సిన అవసరం ఉందనిపిస్తేనే సభకు వెళ్తాను. నేను నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికైన రాజ్యసభ స్వతంత్ర సభ్యుడిని. నన్ను ఏ పార్టీ ఆదేశించలేదు. నాకు నచ్చినప్పుడు వస్తా.. నచ్చినప్పుడు వెళ్తా. ఇంకా కరోనా మహమ్మారి విజృంభణ కొసాగుతూనే ఉంది. ఈ సమయంలో సామాజిక దూరం పాటించాల్సి ఉన్నా.. సభలో అది జరగట్లేదు. సీటింగ్ అరేంజ్‌మెంట్ కూడా అసౌకర్యంగా ఉంది" అని జస్టిన్ రంజన్ గొగొయి తెలిపారు.
ఇదీ చదవండి: