ETV Bharat / bharat

Rupadevi: రామోజీరావు తాతయ్యకు ధన్యవాదాలు.. మరో చిన్న కోరిక..! - Para Badminton Rupadevi today news

Para Badminton Rupadevi latest news: శ్రీకాకుళం జిల్లా సంతవురిటి గ్రామానికి చెందిన పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పడాల రూపాదేవి ఆర్థిక సమస్యపై రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు స్పందించారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కావాల్సిన సహాయాన్ని అందించారు. అంతేకాదు, పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి రూపాదేవి గురించి తన మనసులోని మాటలను లేఖలో వివరించారు.

Para Badminton
Para Badminton
author img

By

Published : Apr 29, 2023, 7:27 PM IST

Updated : Apr 29, 2023, 8:11 PM IST

రామోజీరావు తాతయ్యకు ధన్యవాదాలు

Para Badminton Rupadevi latest news: 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనే మాటను రుజువు చేస్తూ.. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం దాకా ఎంతోమంది యువతీ-యువకులు అనేక రంగాల్లో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అహర్నిశలు శ్రమించి.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించి.. అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను నిరూపించుకున్నారు. ఆ విధంగా.. తన కళను సాకారం చేసుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి ముందడుగు వేసింది.

అయితే, ఆమెకు అనుకోని పరిస్థితిలో అంగ వైకల్యం దాపురించింది. పేదరికం వెంటాడుతోంది. అయినా కూడా దేశానికి పారా బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్స్ తీసుకురావడానికి సిద్దమైంది. ప్రస్తుతం ఆ లక్ష్యం వైపుగా ముందుకు సాగుతోంది. మరికొన్ని రోజుల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొనడానికి ఎంపికైంది. కానీ, ఆర్థిక సమస్యను అధిగమించలేక సతమతమైంది. అటువంటి తరుణంలో 'ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్' ఆమెను పలకరించింది. ఆ యువతి సమస్యను ఇంటర్వ్యూ ద్వారా లోకానికి తెలియజేసింది. ఆ యువతి పరిస్థితిపై స్పందించిన.. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆమెకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.

అంగ వైకల్యం-అంతర్జాతీయం.. శ్రీకాకుళం జిల్లా సంతవురిటి గ్రామానికి చెందిన పడాల రూపాదేవికి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన రెండు కాళ్లలో చలనం కోల్పోయింది. తన జీవితం ఇంతే అని కూర్చోకుండా.. తలరాతకు తలొంచకుండా తట్టుకుని నిలబడింది. చిన్న పల్లెటూరు నుంచి క్రమంగా ఎదుగుతూ.. పారా బ‌్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బంగారు, వెండి పతకాలు గెలిచిన ఈ యువతి.. మే 9 నుంచి 14 వరకు థాయ్‌లాండ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించింది. కానీ, అది లక్షలతో కూడుకున్న వ్యవహారం. వీరి కుటుంబ ఆర్థిక స్థాయి అంతంత మాత్రమే. తనకు ఆర్థిక సాయం అందిస్తే దేశానికి కచ్చితంగా పతకం తెస్తానంటూ.. తనకు దాతలు సహాయం చేయాలంటూ వేడుకుంది.

అమ్మా రూపా..! ఈ నేపథ్యంలో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు స్పందించారు.. పారా బ్యాడ్మింటన్‌ రూపాదేవి ఆర్థిక సమస్యను తీర్చారు. ''అమ్మా రూపా!..విధి వంచించి అనుకోని ప్రమాదంలో కాళ్ల కదలిక కోల్పోయినా ఏమాత్రం వెరవకుండా వికలాంగుల బ్యాడ్మింటన్ రంగంలో మునుముందుకు సాగుతున్న మీకు ఈ తాతయ్య నుంచి ఆశీస్సులు, అభినందనలు. అన్నీ ఉండి ఏమీ చేయలేమంటూ కుంగి, కుమిలిపోయే ప్రబుద్ధులకు మీ కథ గొప్ప కనువిప్పు. ఒకవైపు క్రీడారంగంలో రాణిస్తూనే చదువునూ కొనసాగిస్తున్న మీ ఆశయం నాలో కూడా కొత్త ఉత్సాహం నింపిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. పారా బ్యాడ్మింటన్ రంగంలో జాతీయ స్థాయికి ఎదిగేందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థాయ్‌ల్యాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొనడానికి మీకెదురైన ఆర్థిక అవరోధాన్ని గురించి ఈటీవీ యువ కార్యక్రమం ద్వారా తెలిసి, ఈ లేఖ రాస్తున్నాను. ఆ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి కావాల్సిన మూడు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నాను. మీవంటి దైర్యశాలికి ఈ కొంత చేయూత అందించడం నాకు గర్వంగా ఉంది. మీరు కోరిన మొత్తం మీ అకౌంట్లో జమ అవుతుంది. ఈ అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచి మీరు దేశానికే గర్వకారణంగా నిలిస్తే అది చూసి ఆనందించేవాళ్లలో నేను ముందుంటానని తెలియజేస్తున్నాను'' అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

తాతయ్యను కలవాలని ఉంది.. తనకు ఆర్థిక సహాయం అందించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు క్రీడాకారిణి రూపాదేవి ధన్యవాదాలు తెలిపింది. సమస్యపై వెంటనే స్పందించి... తనకు సాయం అందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొంది. ఆయన తనను తన మనవరాలిగా అంగీకరించించి.. మూడు లక్షల రూపాయలను సహాయం చేసిన తాతయ్యను కలవాలని ఆశగా ఉందని వ్యాఖ్యానించింది.

రామోజీరావు సాయంపై రూపాదేవి కుటుంబసభ్యులు, బంధువులు, సంతవురిటి గ్రామస్థులు... హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 29, 2023, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.