ETV Bharat / bharat

రామోజీ ఫిల్మ్​ సిటీ నేటి నుంచే రీఓపెన్​

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ.. పర్యటకులకు స్వాగతం పలుకుతోంది. నేటి నుంచి సందర్శకుల కోసం పునఃప్రారంభం కాబోతోంది. పర్యటక స్వర్గధామం ఫిల్మ్‌సిటీలో వినోదాలను ఆస్వాదిస్తూ విహారానుభూతిని సొంతం చేసుకోవడానికి సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కసారి వీక్షించి.. మీ హాలిడేను చిరస్మరణీయంగా మలచుకోండి.

Ramoji Film City All Set To Reopen For Tourists On October 8
రామోజీ ఫిల్మ్​ సిటీ పర్యటకం షురూ
author img

By

Published : Oct 7, 2021, 4:52 PM IST

Updated : Oct 8, 2021, 6:24 AM IST

సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్​ సిటీ మళ్లీ తెరుచుకునేందుకు సిద్ధమైంది. అక్టోబర్​ 8న(శుక్రవారం) పునఃప్రారంభం కానుంది. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రామోజీ ఫిల్మ్​సిటీ సందర్శన.. మరపురాని అనుభూతి

అన్ని ఎంటర్​టైన్​మెంట్ జోన్లలో కరోనా నియమాలను పక్కాగా అమలు చేస్తున్నారు. పర్యటకులు భౌతిక దూరం పాటిస్తూ.. తమ వెకేషన్​ను జాలీగా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన.. పర్యటకులకు మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలేలా అడుగడుగునా అనేక విశేషాలు ఆకట్టుకుంటాయి. సుమారు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అద్భుత పర్యటక ప్రదేశం(Ramoji Film City) ఎన్నో ప్రత్యేకతలకు నెలవు.

Ramoji Film City All Set To Reopen For Tourists
రామోజీ ఫిల్మ్​ సిటీ

కళ్లారా వీక్షించొచ్చు..

రామోజీ ఫిల్మ్‌సిటీలోకి అడుగు పెట్టే పర్యటకులకు స్వాగత వేడుక, బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన సెట్‌ సందర్శన, యురేకా అందాలు, షాపింగ్‌ అనుభూతి, రామోజీ మూవీ మ్యాజిక్‌, ఫిల్మ్‌సిటీ టూర్‌, పక్షుల కిలకిలరావాల బర్డ్‌పార్క్‌, అందాల సీతాకోక చిలుకల పార్కు.. ప్రత్యేక షోలు, చిన్న, పెద్దలను ఆకట్టుకొనే రైడ్స్‌, చిన్నారులకు ఫండుస్థాన్‌.. ఇలా ఒక్కటేమిటి.. ఆబాలగోపాలాన్నీ అలరించేందుకు ఎన్నెన్నో విశేషాలున్నాయి. అను క్షణం ఆనంద వీక్షణాలను ఆస్వాదిస్తూ.. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనతో ప్రతి ఒక్కరూ ఆనంద తీరాలను చేరవచ్చు. ఫిల్మ్‌సిటీ సందర్శనతోపాటు విడిది ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

1. స్టూడియో టూర్

స్టూడియో టూర్​తో అద్భుత ఊహా లోకంలో ఆనందంగా గడపండి. వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించండి. సినిమా సెట్టింగ్​లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లు సందర్శిస్తూ.. విభిన్న వినోదంతో మీ హాలిడేను చిరస్మరణీయం చేసుకోండి.

ఫిల్మ్ సిటీలో ఆకర్షణీయమైన ఫౌంటెయిన్

2. యురేకా

రెప్పపాటులో వేరే యుగానికి, టైమ్​ జోన్​లోకి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఫిలింసిటీలో యురేకాను ఒక్కసారైనా మీరు సందర్శించాల్సిందే. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. అమెరికన్​ వైల్డ్ వెస్ట్​ అందాలతో వినూత్న అనుభవాన్ని పొందుతారు. ఆటపాటలు, ప్లే కోర్టులు, థీమ్డ్​ రెస్టారెంట్లు, మధ్యయుగాన్ని తలపించే మీనా బజార్‌ విశేషంగా ఆకర్షిస్తాయి.

3. లైవ్​ షోలు

రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే లైవ్​ షో రంగుల వినోదాన్ని అస్సలు మిస్​ కావద్దు. అదిరే కొరియాగ్రఫీతో చేసే లైవ్​ డాన్స్​ షోలు, యాక్షన్​ ప్యాక్డ్​ వైల్డ్​ వెస్ట్ స్టంట్ షో చూస్తే వారెవా అంటారు. కళాకారుల ఆన్​ స్టేజ్ లైవ్​ పెర్ఫామెన్స్​కు యానిమేషన్​ కలిపి చేసే బ్లాక్​లైట్​ షో మరో హైలైట్.

4. రామోజీ మూవీ మ్యాజిక్​

ఫిలిం​ మేకింగ్​లో చిట్కాలు తెలుసుకోవాలా? అయితే రామోజీ మూవీ మ్యాజిక్​కు వచ్చేయండి. ఈ అద్వితీయ ఇంటరాక్టివ్ షోలో మీరు అంతరిక్ష నౌక ఎక్కొచ్చు. గెలాక్సీలో ప్రయాణించిన అనుభూతి పొందొచ్చు. ఫిల్మీ దునియాలో డార్క్​ రైడ్​తో ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించొచ్చు. పౌరాణిక అల్లాదీన్ ప్యాలెస్, ప్రపంచ వింతలతో ఊహల్లో విహరించొచ్చు.

5. చిల్డ్రన్స్​ అట్రాక్షన్​

రామోజీ ఫిలిం సిటీలోని ఎక్స్​క్లూజివ్​ ప్లే జోన్లు పిల్లలను విశేషంగా అలరిస్తాయి. భారీ సైజులో ఉండే బోర్డుపై స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ ఆడడం సరికొత్త అనుభూతినిస్తుంది. 'దాదాజిన్​'తో కలిసి ప్రత్యేక ఎంటర్​టైన్​మెంట్​ జోన్​లో​ థ్రిల్లింగ్, ఫన్ రైడ్స్, గేమ్స్ మరో హైలైట్. రెయిన్ డాన్స్, డోమ్ థియేటర్ షో చిన్నారులను మైమరిపిస్తాయి.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు

6. బోరాసురా

బోరాసురా.. ఓ మాయాలోకం. ఎటుచూసినా సస్పెన్స్​, థ్రిల్లింగ్ విషయాలే. సందర్శకులను భయపెట్టే మిస్టరీ దృశ్యాలు, వింత శబ్దాలతో రూపొందించిన ఈ మెజీషియన్​ వర్క్​షాప్​ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

7. బాహుబలి సెట్లు

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి అనుభూతిని ప్రత్యక్షంగా పొందాలా? అందుకు రామోజీ ఫిలిం సిటీ విజిట్ ఏకైక అవకాశం. దాదాపు 600 రోజులకుపైగా ఈ సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగింది. మాహిష్మతీ సామ్రాజ్యంలోని సుందర రాజప్రసాదాలు, అద్భుత ఆలయాల మధ్య మీరు సరదాగా విహరించొచ్చు.

బాహుబలి సెట్​

8. ఎకో టూర్​

ఎకో టూర్​ ద్వారా ప్రకృతి వైవిధ్యాన్ని ఆస్వాదించండి. పచ్చని పందిరి కింద ఉన్న బర్డ్ పార్క్​ వివిధ ఖండాలకు చెందిన పక్షులకు నిలయం. అన్యదేశ జాతులు, రంగులు కలిగిన అద్భుతమైన బటర్​ఫ్లై పార్కును సందర్శించి మైమరిచిపోండి. సీజనల్​, శాశ్వత మొక్కల అద్భుత కూర్పు బోన్సాయ్​ పార్కును వీక్షించండి.

9. సాహస్​ అడ్వెంచర్ ల్యాండ్​

వినోదంతోపాటు కాస్త సాహసమూ ఉంటే బాగుంటుంది కదూ! ఆసియాలోనే అందుకు అత్యుత్తమ వేదిక.. రామోజీ ఫిలిం సిటీలోని సాహస్​. అన్ని వయస్కుల వారిని థ్రిల్ చేస్తుంది సాహస్. రోప్ కోర్స్, నెట్​ కోర్స్​, ఏటీవీ రైడ్​, మౌంటెయిన్​ రైడ్​, పెయింట్​బాల్, షూటింగ్​, జార్బింగ్, బంగీ ఎజెక్షన్​ వంటి యాక్టివిటీలు సాహస్​ హైలైట్స్​.

ఇలా ఎన్నో వినోదాలు, వింతలు, విశేషాలకు నిలయమైన రామోజీ ఫిలిం సిటీకి మీ ఆప్తులతో వచ్చి.. మరిచిపోలేని అనుభూతిని పొందండి.

ఫిల్మ్‌సిటీ సందర్శించాలంటే..

రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శించాలనుకునే వారు వివరాలకు టోల్‌ ఫ్రీ నంబరు 1800 120 2999 సంప్రదించువచ్చు. లేదా www.ramojifilmcity.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

Last Updated : Oct 8, 2021, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.