Rameshwaram Cafe New Branch Will be Open Soon in Hyderabad: ఐటీ అడ్డా బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతం. మూడేళ్ల క్రితం వరకు అక్కడ ల్యాండ్ మార్క్ ఏంటో పెద్దగా తెలియదుగానీ.. ఇప్పుడు అందరికీ ఒకటే మార్క్. అదే.. "రామేశ్వరం కేఫ్". నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే పదానికి ట్రెండీ ఎగ్జాంపుల్ కావాలంటే.. ఈ టిఫెన్ సెంటర్‌ను చూపించొచ్చు. 24/7 కస్టమర్లతో కళకళ.. గల్లాపెట్టె గలగలా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి! ఇక్కడ నెయ్యితో వేసిన దోశ తిన్నారంటే "మాయమైపోవాల్సిందే" అన్నది ఓ యువకుడి అనుభూతి. సూపర్ క్వాలిటీ ఇడ్లీ తిన్నారంటే.. "ఔర్ ఏక్ ప్లేట్" ఆర్డర్ ఇవ్వాల్సిందే అన్నది మరో యువతి ఫీలింగ్. ఈ ఎక్స్ప్రెషన్స్ ఎల్లలు దాటి.. ఇంటర్నెట్ గుండా దేశమంతా విస్తరిస్తున్నాయి. ఈ ఊపులోనే రామేశ్వరం కేఫ్‌ను రాష్ట్రం, దేశం సరిహద్దులు కూడా దాటించి.. ఫారెన్‌లో బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు చూస్తున్నారు ఓనర్స్!
Famous Temples in Hyderabad : మీరు హైదరాబాద్‌లో తప్పక దర్శించుకోవాల్సిన 7 ప్రముఖ దేవాలయాలివే.!
అలా మొదలైంది! ప్రెస్టీజియస్ అహ్మదాబాద్ IIMలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేసింది దివ్య. CA అడిషనల్ క్వాలిఫికేషన్. కానీ.. ఏసీ రూమ్‌లో కీబోర్డ్ ముట్టుకోవడం, బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవడం వదిలేసి.. ఉడిపి హోటల్లో గరిట పట్టుకునేందుకు సిద్ధమైంది! రాఘవేంద్రతో చేయి కలిపింది. ఇతనికి ఫుడ్ ఫ్యాక్టరీలో 15ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్న వీరిద్దరూ.. ముందు స్నేహితులయ్యారు. ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ అయ్యారు. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ ప్రపంచాన్ని దున్నేస్తున్నారు.
ఏడాదికి రూ.50 కోట్లు.. రామేశ్వరం కేఫ్ దూసుకుపోతున్న తీరు.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిఫెన్ సెంటర్ మీద ఆదాయమంటే నెలకు ఓ "లకారం" వేసుకోండి! అంతేగానీ లక్షలు దాటి కోట్ల రూపాయల ఇన్కమ్ ఏంది సామీ! అన్నది జనాల మాట. ఈ రెస్టారెంట్ నెలకు దాదాపుగా రూ.4.5 కోట్లు ఆర్జిస్తోందని అంచనా. అంటే.. సంవత్సరానికి ఏకంగా 50 కోట్ల పైమాటే! ఈ డీటెయిల్స్ సెజల్ సుద్ అనే కస్టమర్ 'X'లో పోస్టు చేశారు. మిగిలిన జనాలు కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నారు. ఫేమస్ టీవీ షో "మాస్టర్‌చెఫ్ ఆస్ట్రేలియా"లోని జడ్జీలలో ఒకరైన ప్రముఖ చెఫ్ గ్యారీ మెహిగాన్ కూడా రామేశ్వరం కేఫ్ గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను తిన్న దోశ గురించి ఒక వీడియోను షేర్ చేయడంతో.. ఈ కేఫ్ మరింతగా వైరల్ అయ్యింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Panipuri : నోరూరించే పానీపూరీ.. దీని కథ మీకు తెలుసా?
రెండేళ్ల వయసులోనే! ఒక బిజినెస్ ఈ స్థాయిలో డెవలప్ కావడానికి ఏళ్లు పడుతుంది. కానీ.. రామేశ్వరం కేఫ్ వయసు కేవలం రెండేళ్లే! 2021లో ఈ కేఫ్ ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. తమదైన క్వాలిటీ.. టేస్ట్‌తో అనతి కలంలోనే కస్టమర్ల నమ్మకాన్ని సాధించారు. ఇంకేముంది? జనాలు దారికట్టడం మొదలు పెట్టారు. దీంతో.. నిర్వాహకులు క్రమంగా ఔట్లెట్లను విస్తరించడం మొదలు పెట్టారు. దోశ, ఇడ్లీ, వడ అంటూ.. సౌత్ ఇండియా డిషెస్ మొత్తం లభిస్తాయిక్కడ. ఈ కేఫ్‌లో దాదాపు 200 మందికి పైగా పనిచేస్తుంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బెంగళూరు టూ ఫారెన్ వయా హైదరాబాద్! రామేశ్వరం కేఫ్ పేరు మార్మోగుతుండడంతో.. సాధ్యమైనన్ని ప్రాంతాలకు విస్తరించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ శాఖలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. బెంగళూరు పూరి హైదరాబాద్‌లో పొంగనుంది! హైటెక్ సిటీలోని జైన్స్ సద్గురు క్యాపిటల్ పార్క్ సమీపంలోని ఇమేజ్ గార్డెన్ రోడ్‌లో రామేశ్వరం కేఫ్ ఓపెన్ కాబోతోంది. ఇప్పటికే నగరంలో కంచి కేఫ్, తాజా కిచెన్, పంచెకట్టు దోస, తాజా టిఫిన్స్, స్వచ్ మొదలైనవి ఉన్నాయి. రామేశ్వరం వీటికి డిఫరెంట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే రిబ్బన్ కట్ చేసుకోబోతున్న ఈ కేఫ్‌లో.. టిఫెన్ టేస్ట్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కొంత కాలం వరకు ఇక్కడి వెదర్ క్రేజీగా ఉంటుందనడంలో నో డౌట్. సోషల్ మీడియా ద్వారానే ఫుల్ ఫేమ్ సంపాదించిన రామేశ్వరం కేఫ్ ముందు.. హైదరాబాదీల సెల్ఫీ షూట్స్ పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆర్డర్ వేయనున్నారు.. "ఏక్ దోశ" అని!
- " class="align-text-top noRightClick twitterSection" data="">