ETV Bharat / bharat

ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిది - అభద్రతా భావాన్ని దరి చేరనివ్వొద్దు : ఈనాడు ఎండీ కిరణ్

Rama Devi Public School Annual Day Celebrations In Hyderabad : ఈప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిదని అభద్రతా భావాన్ని దరి చేరనివొద్దని ఈనాడు ఎండీ కిరణ్ చిన్నారులకు సూచించారు. రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవానికి హాజరైన ఆయన ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్ ప్రసాద్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరిలతో కలిసి పాఠశాల విద్యార్థులు రూపొందించిన బాలభారత్ మ్యాగజైన్‌ని ఆవిష్కరించారు. వార్షికోత్సవ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Annual day Celebrations At Rama Devi Public School
Rama Devi Public School annual day celebrations in Hyderabad
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 8:11 AM IST

Updated : Dec 10, 2023, 8:37 AM IST

ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిది - అభద్రతా భావాన్ని దరి చేరనివ్వొద్దు : ఈనాడు ఎండీ కిరణ్

Rama Devi Public School Annual Day Celebrations In Hyderabad : రామోజీఫిల్మ్ సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ సంబురాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణలో ఉడాన్ పేరిట నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్‌కి విద్యార్థినీ విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై సందడి చేశారు. ఉన్నత ప్రమాణాలతో సురక్షిత వాతావరణంలో విద్యాబోధన కొనసాగుతున్న రమాదేవి పబ్లిక్ స్కూల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఏటా విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది నిర్వహించిన వేడుకలకు ఈనాడు ఎండీ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్ ప్రసాద్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ ఎండీ బృహతి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల వైస్‌ప్రిన్సిపల్ రమాదేవి పబ్లిక్ స్కూల్ వార్షిక నివేదికను వివరించారు.

రమాదేవి పబ్లిక్​ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ఫ్లోరా పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన..

"సమాజంలో మనం అభద్రతా భావంతో కంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఎదగగలం. ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిది. అభద్రతాభావాన్ని దరి చేరనివ్వవద్దు. ఈ స్కూల్​లోని వేడుకలు చూస్తుంటే నా పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. పెద్దవారికి, ఎదుటివారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం చిన్నతనం నుంచే పిల్లలు అలవర్చుకోవాలి. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాలి."-కిరణ్ , ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌

Annual day Celebrations At Rama Devi Public School : ఉడాన్ సంబురాల్లో రమాదేవి పబ్లిక్‌ స్కూల్ నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఖ్యాతి జైనీ రెండు బంగారు పతకాలు అందుకోగా మరో విద్యార్థిని నవ్యాదీప్తను ఎండీ కిరణ్ బంగారు పతకంతో అభినందించారు. వారితో పాటు వివిధ రకాల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినీ విద్యార్థులను బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించి భుజం తట్టారు. పాఠశాల విద్యార్థులు రూపొందించిన బాలభారత్ మ్యాగ్జైన్‌ని ఆవిష్కరించారు.

వేడుకలకు హాజరైన తల్లిదండ్రులు, చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించిన ఈనాడు ఎండీ కిరణ్ చిన్నారులు అభద్రత భావంతో కంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఎదగగలమని పేర్కొన్నారు. వేడుకలను చూస్తుంటే తన పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రపంచం ఆత్మవిశ్వాసం కలిగిన వారిదని అభద్రతాభావాన్ని దరి చేరనివ్వవద్దని సూచించారు. ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం చిన్నతనం నుంచే పిల్లలు అలవర్చుకోవాలని, ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాలని కోరారు. చిన్నారుల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు.

''ఉన్నత ప్రమాణాలతో సురక్షిత వాతావరణంలో విద్యాబోధన కొనసాగుతున్న రమాదేవి పబ్లిక్ స్కూల్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కనీసం మౌలికవసతులు లేని స్కూళ్లు ఇక్కడ చెల్లించే ఫీజుల కన్నా పదింతలు ఎక్కువ డిమాండ్ చేస్తున్నాయి. అద్భుతమైన విద్యార్థులను ప్రపంచానికి అందించాలని ఈ స్కూలు ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తిస్థాయిలో విద్యార్థులు వినియోగించుకోవాలి." -డీఎన్ ప్రసాద్, ఈనాడు తెలంగాణ సంపాదకులు

రమాదేవి పబ్లిక్ స్కూల్​లో సైన్స్​ ఎక్స్​ప్లోరా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకున్న విద్యార్థులు

Teachers Day Celebrations At Ramadevi Public School : రమాదేవి పబ్లిక్ స్కూల్​లో ఘనంగా టీచర్స్ డే

Last Updated : Dec 10, 2023, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.