అయోధ్య రామ మందిరానికి బలమైన పునాది కోసం రామ మందిర ట్రస్ట్ ఐఐటీలను సూచనలు కోరింది. ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మించాలనుకుంటున్న పునాది సాధ్యం కాదని నిపుణుల పరిశీలనలో తేలినట్టు సమాచారం. నిర్మాణ స్థలంలోని భూగర్భంలో సరయూ నది వాగు ప్రవహించడమే ఇందుకు కారణమని తెలిసింది.
రెండు మార్గాలు..
పునాది నిర్మాణానికి ఆలయ నిర్మాణ కమిటీ రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రాతి స్తంభాలను పునాదిగా వేయాలని... లేదా మట్టి నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
ఇదీ చూడండి : 'విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా యూపీ'