రాజస్థాన్‌లో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. రైతుల ర్యాలీకి హాజరవడానికి వెళ్తుండగా.. ఆయన కారుపై గుర్తుతెలియని కొందరు దాడి చేశారు. టికాయిత్ సహా ఆయన మద్దతుదారులు.. హర్సోలీ నుంచి బన్సూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అక్కడే నిరసనకు దిగారు టికాయిత్ మద్దతుదారులు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పాలనా యంత్రాంగం పరిస్థితిని అదుపు చేసింది.
ఇదీ చూడండి: 'ఓటమి తప్పదనే భాజపా ఐటీ దాడుల అస్త్రం'