ETV Bharat / bharat

గంట ముందుగానే రాజ్యసభ సెషన్​- 'దిల్లీ' బిల్లుపై చర్చ - పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

దిల్లీపై కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై బుధవారం రాజ్యసభలో చర్చ జరగనుంది. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ గవర్న్​మెంట్​ ఆఫ్​ నేషనల్​ క్యాపిటల్​ టెర్రిటరీ ఆఫ్​ దిల్లీ(జీఎన్​సీటీడీ) బిల్లు లోక్​సభ ఆమోదం పొందింది. ఎగువ సభ సెషన్​ నేడు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుంది.

Rajya Sabha to discuss today bill to give more power to Delhi L-G
గంట ముందుగానే రాజ్యసభ సెషన్​- 'దిల్లీ' బిల్లుపై చర్చ
author img

By

Published : Mar 24, 2021, 6:14 AM IST

వివాదాస్పద 'దిల్లీ' బిల్లుపై నేడు రాజ్యసభలో చర్చ జరగనుంది. రోజు కంటే ఒక గంట ముందే ఇవాళ ఎగువ సభ సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషీ తెలిపారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం, భోజన విరామం ఉండదని స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకు రాజ్యసభ బిజినెస్​ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరుగుతుందని తెలిపారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాల నడుమ మంగళవారం.. రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది.

లోక్​సభలో ఆమోదం..

విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ఈ 'గవర్నమెంట్ ఆఫ్​ నేషనల్​ క్యాపిటల్​ టెర్రిటరీ ఆఫ్ దిల్లీ(జీఎన్​సీటీడీ)-సవరణ బిల్లు' లోక్​సభలో ఆమోదం పొందింది. దేశ రాజధానిపై కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చేలా ఈ బిల్లును రూపొందించారు.

దీని ప్రకారం దిల్లీ ప్రభుత్వమంటే.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని, కార్యనిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన అభిప్రాయం తీసుకోవాలని పొందుపరిచారు.

విపక్షాల విమర్శలు..

దిల్లీ ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కునేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఆమ్​ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్​ విమర్శించింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాల ప్రజాస్వామ్య హక్కులను ఈ బిల్లు కాలరాస్తుందని అన్నారు రాజ్యసభలో కాంగ్రెస్​ పక్షనేత మల్లికార్జున ఖర్గే.

ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్​, రాష్ట్రీయ జనతా దళ్​, సమాజ్​వాదీ పార్టీ, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ, శివసేన, డీఎంకే.. రాజ్యసభలో ఎన్​సీటీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అన్నారు ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​.

ఇదీ చూడండి: వివాదాస్పద 'దిల్లీ' బిల్లుకు లోక్​సభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.