ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేసం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలు, సభా కార్యకలాపాలపై అన్ని పార్టీల నాయకులు చర్చించారు. సమావేశాలు ప్రారంభమయ్యాక తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చించాలని భేటీలో నిర్ణయించారు.
అంతకుముందు సమావేశమైన రాజ్యసభ బీఏసీ.. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 10గంటలు, బడ్జెట్ పై చర్చకు 10గంటల సమయాన్ని కేటాయించింది. 267 నిబంధన కింద రైతుల అంశాలపై చర్చ జరపాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 5న రాజ్యసభలో ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు.