ETV Bharat / bharat

'సైనికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం'

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం లద్ధాక్ చేరుకున్నారు. లేహ్‌లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

rajnath
రాజ్‌నాథ్ సింగ్
author img

By

Published : Jun 27, 2021, 12:36 PM IST

'వన్ ర్యాంక్-వన్ పెన్షన్' ప్రకటించడం ద్వారా సైనికులకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకుని తన నిబద్ధతను చాటుకున్నారని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం లద్ధాక్ చేరుకున్న ఆయన.. లేహ్‌లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ప్రసంగించారు. సైన్యంలో విశిష్ఠ సేవలందించిన అనంతరం వారు ఉన్నతంగా స్థిరపడేందుకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా రాజ్​నాథ్​ స్పష్టం చేశారు.

"డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్​మెంట్​ ద్వారా సైన్యంలో ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. వీటిలో అనుభవజ్ఞులకు, విశ్రాంత సైనికులకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుంది. ఈ పనిని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం."

-రాజ్​నాథ్​ సింగ్

మీరు ఏ విధంగానైతే దేశాన్ని రక్షిస్తున్నారో.. అదే విధంగా మిమ్మల్ని కాపాడుకోవటం మా లక్ష్యమని ఉద్ఘాటించారు రాజ్​నాథ్​. సైనికుల సమస్యలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్​ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.