శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు విజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆ పార్టీ అధినేతలు మమతా బెనర్జీ, స్టాలిన్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. బంగాల్లో మమతా గెలుపుపై స్పందించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఆమె పదవీకాలం దిగ్విజయంగా సాగాలని ట్వీట్ చేశారు. స్టాలిన్‌కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
"బంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి అభినంధనలు. బంగాల్లో ఎన్నికల్లో మీ పార్టీ విజయం సాధించింది. మరోమారు సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో శుభాకాంక్షలు."
-రాజ్‌నాథ్, రక్షణ మంత్రి
అసోంలో అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం సర్బానంద సోనోవాల్‌కు అభినందనలు తెలుపుతు రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
కేరళలో తిరిగి అధికారం చేపట్టనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అభినందనలు తెలుపుతూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి: