రాజస్థాన్‌లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు పెద్దఎత్తున నిరసనలు దిగారు. 'మహాపదవ్' పేరిట చేస్తున్న ఈ ఆందోళనలు గత 32రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న నిరుద్యోగ(unemployment in rajasthan) యువతీయువకులు.. రోడ్డుపై పడుకుని చేతులు జోడించి తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం అశోక్ గహ్లోత్‌కు(ashok gehlot today news) విన్నవించారు.
మరోవైపు.. తాము డిమాండ్ చేస్తున్న 21 అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని నిరుద్యోగులు(unemployment rate in rajasthan) తెలిపారు. దీనితో తమ నిరసనలను ఉత్తర్‌ప్రదేశ్‌కు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపేన్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు 50 మంది సభ్యుల బృందం జైపుర్ నుంచి యూపీకి బయలుదేరి వెళ్లినట్లు వివరించారు.
"నవంబర్ 24 నుంచి ఉత్తరప్రదేశ్‌లో 'మహాపదవ్' నిరసనలను ఆరంభిస్తాం. ఇప్పటికే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ర్యాలీల్లో నల్లజెండాలతో నిరసన తెలిపాం. ఇకపై ప్రతి సమావేశంలోనూ ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం."
---ఉపేన్ యాదవ్, నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు
తమ డిమాండ్ల పరిష్కారానికి గాంధేయ మార్గంలో నిరసన చేస్తున్నామని.. ప్రభుత్వం దిగిరాకుంటే నవంబర్ 24 నుంచి యూపీలో కాంగ్రెస్ సమావేశాల్లో(uttar pradesh congress rally) పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు.
ఇవీ చదవండి: