రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిరోహి జిల్లాలోని మౌంట్అబు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
![wo burnt alive and died in Sirohi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13274376_vlcsnap-2021-10-06-12h53m12s844.jpg)
తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగి.. వారిపై పడింది. కరెంట్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా.. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని వారిద్దరు సజీవ దహనమయ్యారు.
స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతులను రాజసమంద్ జిల్లాకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్మాస్టర్ లైంగిక వేధింపులు!