ETV Bharat / bharat

రాజస్థాన్ సీఎం ఎంపికపై ఉత్కంఠ- వసుంధరతో ఎమ్మెల్యేల భేటీ! కొత్తవారికి ఛాన్స్ ఉంటుందా? - రాజస్థాన్​లో సీఎం పేరు ప్రకటన వార్తలు

Rajasthan New CM : ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో బీజేపీ కొత్తవారిని సీఎంగా నియమించటం వల్ల ఇప్పడు అందరి చూపు రాజస్థాన్​వైపే ఉంది. రెండు రాష్ట్రాల్లాగా లేదా పాతవారికే అవకాశం ఇస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Rajasthan New CM
Rajasthan New CM
author img

By PTI

Published : Dec 12, 2023, 12:59 PM IST

Rajasthan New CM : ఛత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రులను ప్రకటించిన బీజేపీ, ఇప్పుడు రాజస్థాన్​పై దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల్లో మాదిరిగా కొత్తవారికి అవకాశం ఇస్తుందా లేదా పాతవారికే మొగ్గు చూపుతుందా అనే విషయంపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోవైపు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇంటికి కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లి కలవటం చర్చనీయాంశంగా మారింది. శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యేల కలవడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే ఎమ్మెల్యేలు వెళ్లి కలుస్తున్నంతమాత్రాన దానిని లాబీయింగ్​గా చూడరాదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్​నాథ్​, పార్టీ నేతలు సరోజ్​పాండే, వినోద్ తావ్డేలకు బీజేపీ అప్పగించింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎం పేరును ఆమోదించనున్నారు. సీఎంగా ఎవరిని నియమిస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.

  • #WATCH | Rajasthan: Bharatiya Janata Party (BJP) is set to select the Rajasthan Chief Minister today.

    The party's Legislature party meeting is scheduled to be held this evening in Jaipur. pic.twitter.com/T596jARphI

    — ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం రేసులో ఎవరెవరు ఉన్నారంటే
మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. దియా కుమారి, మహంత్​ బాలక్​నాథ్, కిరోడీలాల్​ మీణాలతో పాటు, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్​రామ్ మేఘ్​వాల్, అశ్విన్​ వైష్ణవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అన్న ఉత్కంఠ ఉంది.

ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​లో కొత్తవారికి ఛాన్స్​
ఇప్పటికే గెలిచిన రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ప్రకటిచింది భారతీయ జనతా పార్టీ. ఛత్తీస్​గఢ్​లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్​సాయ్​ని సీఎంగా నియమించింది. అలానే మధ్యప్రదేశ్​లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, సీఎం రేసులో ఉన్న వారిని కాదని కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి మోహన్​ యాదవ్​ను ఎంపిక చేసింది. నవంబర్​ 25న 199 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అయితే సీఎంగా ఎవరిని నియమిస్తుంది అనేది తెలియాలంటే మంగళవారం సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.

మూడు రాష్ట్రాలకు కొత్త సీఎంలు ఎవరో తేల్చే పని వారిదే!- కీలక నేతల్ని రంగంలోకి దింపిన బీజేపీ

గహ్లోత్-పైలట్ ఫైట్, గుజ్జర్లు దూరం- రాజస్థాన్​లో కాంగ్రెస్ పతనానికి కారణాలివే!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.