భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త (man kills wife). ఈ ఘటన రాజస్థాన్‌లోని భివాండీలో జరిగింది. మిలక్పుర్కు చెందిన సాహీనా(35)పై అనుమానంతో ఆమె భర్త ముస్తాక్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
"మద్యం మత్తులో ఉన్న ముస్తాక్ తొలుత సాహీనా ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆమె లేవలేని స్థితిలో ఉండగా గొంతును గొడ్డలితో దారుణంగా నరికేశాడు." అని పోలీసులు తెలిపారు. సాహీనాకు ఐదుగురు పిల్లలు. ఆమె పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు ముస్తాక్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు తగిన ఆధారాలు సహా హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాలించిన అనంతరం పరారీలో ఉన్న ముస్తాక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
"దంపతులకు రోజూ గొడవ పడుతుండేవారు. సాహీనాకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital affairs) ఉందని ముస్తాక్ అనుమానించేవాడు." అని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త