పాకిస్థాన్‌కు రహస్య సమాచారం పంపిస్తున్న అనుమానిత గూఢచారిని (spy arrested in India) బెంగళూరులో అరెస్టు చేశారు. నిందితుడిని రాజస్థాన్‌కు (Rajasthan Pakistan spy) చెందిన జితెందర్ సింగ్‌గా గుర్తించారు.
బట్టలు విక్రయిస్తూ బెంగళూరులో జీవిస్తున్న జితెందర్.. నగరంలోని కీలక సంస్థలు, స్థావరాల గురించి పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు సమాచారం పంపిస్తున్నాడు. బెంగళూరులోని దక్షిణ కమాండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. కాటన్‌పేట్‌లోని జాలీ మొహల్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. (Pakistan spy arrested in Bangalore)
కరాచీ ఫేస్బుక్ ఖాతాకు..
నిందితుడు ఆర్మీ కమాండో యూనిఫాం ధరించి సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేవాడని అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌లోని బాడ్మేర్ మిలిటరీ స్టేషన్‌కు సంబంధించిన ఫొటోలు, అక్కడ ఉన్న వాహనాల గురించిన వివరాలను పాకిస్థాన్‌కు పంపించాడని తెలిపారు. నిందితుడి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలపై నిఘా వేసి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు.
మహిళ పేరుతో ఉన్న ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతాకు.. సైనిక స్థావరాల ఫొటోలు పంపించాడని అధికారులు వివరించారు. ఈ ఖాతాను పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు ఐపీ అడ్రెస్ ఆధారంగా కనుగొన్నారు.
డీఆర్డీఓ సిబ్బంది నిర్వాకం
ఇటీవల కీలక సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తూ డీఆర్డీఓ సిబ్బంది పట్టుబడ్డారు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందిపూర్ ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో (DRDO) పనిచేస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని సెప్టెంబర్ 15న అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలపై (Indian defence secrets) విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. వీరు తరచూ విదేశాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేయడాన్ని గుర్తించిన అధికారులు.. వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఇంటిదొంగల స్వైరవిహారం జాతి మనుగడకే ప్రమాదకరం