Rajasthan Election BJP Manifesto : రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. 'సంకల్ప్ పత్ర' పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం జయపురలో ఆవిష్కరించారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే మహిళలు, నిరుద్యోగులు, రైతుల కోసం ఏం చేయనున్నారో వెల్లడించారు జేపీ నడ్డా. తాము అధికారంలోకి రాగానే ప్రశ్నపత్రాల లీకేజీపైనా, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
-
#WATCH | Jaipur | BJP national president JP Nadda releases party's 'Sankalp Patra' for the upcoming assembly elections in Rajasthan. pic.twitter.com/VAksYc3sK0
— ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaipur | BJP national president JP Nadda releases party's 'Sankalp Patra' for the upcoming assembly elections in Rajasthan. pic.twitter.com/VAksYc3sK0
— ANI (@ANI) November 16, 2023#WATCH | Jaipur | BJP national president JP Nadda releases party's 'Sankalp Patra' for the upcoming assembly elections in Rajasthan. pic.twitter.com/VAksYc3sK0
— ANI (@ANI) November 16, 2023
బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 సబ్సిడీ
- 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
- రాష్ట్రంలోని జిల్లాకొక మహిళా పోలీస్ ఠాణా
- ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా డెస్క్
- ప్రతి పట్టణంలో యాంటీ రోమియే స్క్వాడ్ నియామకం
- 'లఖపతి దీదీ' పథకం కింద 6లక్షల గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ
- 12వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీ
- కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య
- 'లడో ప్రోత్సాహన్ యోజన' కింద ఆడపిల్ల పుడితే రూ.2 లక్షల సేవింగ్స్ బాండ్
- రైతులకు గోధుమలపై క్వింటాల్‌కు రూ.2700 బోనస్
- వేలం వేసిన రైతుల భూములకు పరిహారం
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సహాయాన్ని రూ.12,000కి పెంపు
- తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్‌సీపీ) సకాలంలో పూర్తి
- ప్రధానమంత్రి మాతృ వందన్ పథక ఆర్థిక సహాయం రూ.5,000 నుంచి రూ.8,000కు పెంపు
- హెల్త్ డిపార్ట్మెంట్లో రూ.40వేల కోట్ల పెట్టుబడి
- 15వేల మంది వైద్యులు, 20వేల మంది పారామెడికల్ సిబ్బంది నియామకం
- దివ్యాంగులకు నెలకు రూ.1500 పింఛను, వృద్ధాప్య పెన్షన్ పెంపు
మ్యానిఫెస్టో విడుదలకు ముందు.. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. అవినీతి, మహిళలపై నేరాలు, రైతులను అవమానించడం, పేపర్ లీక్‌లు, స్కామ్‌లకు రాజస్థాన్ కాంగ్రెస్ పేరుగాంచిందని ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కాంగ్రెస్ కొత్త రికార్డులు సృష్టించిందని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కుటుంబానినే అన్ని కాంట్రాక్టులు దక్కాయని ఆరోపించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రాజస్థాన్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
ప్రచారంలో కాంగ్రెస్ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్ జోష్, డైలమాలో బీజేపీ!
Rajasthan Elections Key Points : మోదీ Vs గహ్లోత్?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం!