Rajasthan Election 2023 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 199 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. 5.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల కోసం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించారు.
రాష్ట్రంలో 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 10,501 గ్రామీణ ప్రాంతాల్లో 41,006 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. 26 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. దీంతో పాటు ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు 6287 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 2.74 లక్షల మంది పోలింగ్ సిబ్బంది.. ఎన్నికల విధుల్లో భాగం కానున్నట్లు తెలిపారు.
-
Sentinels of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Polling officials gearing up for the assembly elections in Rajasthan.
Polling day is tomorrow. #ECI #GoVote #IVote4Sure #RajashtanElections2023 pic.twitter.com/Z7wNdYBFPV
">Sentinels of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023
Polling officials gearing up for the assembly elections in Rajasthan.
Polling day is tomorrow. #ECI #GoVote #IVote4Sure #RajashtanElections2023 pic.twitter.com/Z7wNdYBFPVSentinels of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023
Polling officials gearing up for the assembly elections in Rajasthan.
Polling day is tomorrow. #ECI #GoVote #IVote4Sure #RajashtanElections2023 pic.twitter.com/Z7wNdYBFPV
పటిష్ఠ భద్రత
శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బందిని రాజస్థాన్‌లో మోహరించారు. ఎన్నికల విధుల కోసం 700 కంపెనీల బలగాలను రంగంలోకి దించారు. 70 వేల మంది రాజస్థాన్ పోలీసులకు తోడు.. 18 వేల మంది హోంగార్డులు, 2వేల మంది సరిహద్దు హోంగార్డులు, 15 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎన్నికల విధుల కోసం మోహరించారు. కేంద్ర పారామిలిటరీ దళాలు, ఇతర రాష్ట్రాల సాయుధ దళాలను సైతం రాష్ట్రంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.
-
"लोकतंत्र रो रंगीलो त्योहार” a vibrant and colourful celebration of the festival of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Rajasthan goes to the polls tomorrow!
Calling on all voters to go to their polling stations and cast their vote#ECI #RajasthanElections2023 #GoVote #AssemblyElections2023 pic.twitter.com/N629Z600WI
">"लोकतंत्र रो रंगीलो त्योहार” a vibrant and colourful celebration of the festival of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023
Rajasthan goes to the polls tomorrow!
Calling on all voters to go to their polling stations and cast their vote#ECI #RajasthanElections2023 #GoVote #AssemblyElections2023 pic.twitter.com/N629Z600WI"लोकतंत्र रो रंगीलो त्योहार” a vibrant and colourful celebration of the festival of democracy!
— Election Commission of India #SVEEP (@ECISVEEP) November 24, 2023
Rajasthan goes to the polls tomorrow!
Calling on all voters to go to their polling stations and cast their vote#ECI #RajasthanElections2023 #GoVote #AssemblyElections2023 pic.twitter.com/N629Z600WI
సరిహద్దుల్లో చెక్ పోస్టులు
రాష్ట్రంలోకి అక్రమ వస్తువులు, సమస్యలు కలిగించే వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పేరుమోసిన డ్రగ్ స్మగ్లర్లు, నేరస్థులను న్యాయస్థానం అనుమతితో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
199 సీట్లే ఎందుకంటే?
రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలు ఉండగా.. శనివారం 199 సీట్లకే ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక పోలింగ్ పడింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన ఇరుపార్టీలు.. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.