Rajasthan Dalit Youth: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా మూత్రం తాగించారని ఓ దళిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఏమైందంటే..?
రాకేశ్ మేగ్వాల్(25) అనే దళిత యువకుడు.. చురు జిల్లాలోని రుఖాసర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. జనవరి 27న రాత్రి 11 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తనను కిడ్నాప్ చేసినట్లు రాకేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మొదట బలవంతంగా మద్యం తాగించారని, అనంతరం తనను కొట్టి మూత్రం తాగించారని తెలిపాడు. ఈ మేరకు రతన్‌గఢ్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రాకేశ్ ఒంటిపై గాయాలను బట్టి.. నిందితులు అతడ్ని కొట్టారని భావిస్తున్నామని రతన్‌గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు. అయితే బాధితుడికి మూత్రం తాగించారా? లేదా? అన్నదానిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
మొత్తం 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: ఘోర రోడ్డుప్రమాదం- ఐదుగురు దుర్మరణం