Rajasthan CM Oath Ceremony : రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. జైపుర్‌లోని చారిత్రక ఆల్బర్ట్ హాలులో శుక్రవారం భజన్‌లాల్ శర్మతో గవర్నర్ కల్‌రాజ్ మిశ్ర ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
-
#WATCH | BJP leader Bhajanlal Sharma takes oath as the Chief Minister of Rajasthan, in the presence of PM Modi and Union Home Minister Amit Shah and other senior leaders, in Jaipur pic.twitter.com/XikKYL7T3w
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | BJP leader Bhajanlal Sharma takes oath as the Chief Minister of Rajasthan, in the presence of PM Modi and Union Home Minister Amit Shah and other senior leaders, in Jaipur pic.twitter.com/XikKYL7T3w
— ANI (@ANI) December 15, 2023#WATCH | BJP leader Bhajanlal Sharma takes oath as the Chief Minister of Rajasthan, in the presence of PM Modi and Union Home Minister Amit Shah and other senior leaders, in Jaipur pic.twitter.com/XikKYL7T3w
— ANI (@ANI) December 15, 2023
-
VIDEO | PM Modi attends the swearing-in ceremony of the new government of Rajasthan in Jaipur. pic.twitter.com/ifSUyAuSQT
— Press Trust of India (@PTI_News) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | PM Modi attends the swearing-in ceremony of the new government of Rajasthan in Jaipur. pic.twitter.com/ifSUyAuSQT
— Press Trust of India (@PTI_News) December 15, 2023VIDEO | PM Modi attends the swearing-in ceremony of the new government of Rajasthan in Jaipur. pic.twitter.com/ifSUyAuSQT
— Press Trust of India (@PTI_News) December 15, 2023
పక్కపక్కనే విరోధులు
అయితే, ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజస్థాన్ రాజకీయాల్లో విరోధులుగా భావించే మాజీ సీఎం అశోక్ గహ్లోత్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పక్కపక్కనే కూర్చున్నారు. సంజీవని కుంభకోణంలో షెకావత్ హస్తం ఉందంటూ గహ్లోత్ అనేక సందర్భాల్లో ఆరోపించారు. ఫలితంగా గహ్లోత్‌పై దిల్లీ కోర్టులో షెకావత్ పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ క్రమంలోనే కొత్త సీఎం ప్రమాణ స్వీకార సమయంలో వీరు మాట్లాడుకుంటూ కనిపించారు.
-
#WATCH | Former Rajasthan CM and senior Congress leader Ashok Gehlot at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/n2Yrgqp40F
">#WATCH | Former Rajasthan CM and senior Congress leader Ashok Gehlot at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
— ANI (@ANI) December 15, 2023
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/n2Yrgqp40F#WATCH | Former Rajasthan CM and senior Congress leader Ashok Gehlot at the swearing-in ceremony of Rajasthan CM-designate Bhajanlal Sharma, in Jaipur
— ANI (@ANI) December 15, 2023
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as deputy chief ministers of the state. pic.twitter.com/n2Yrgqp40F
ఆలయంలో పూజలు చేసిన భజన్‌లాల్
ప్రమాణ స్వీకారానికి ముందు జైపుర్‌లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు భజన్ లాల్. ఆ తర్వాత ఆచార్య మృదుల్ శాస్త్రి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు ఆయన పుట్టినరోజు కూడా శుక్రవారమే కావడం విశేషం. దీంతో అనేక మంది అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
-
#WATCH | Jaipur: BJP leader Bhajanlal Sharma to take oath as the new Chief Minister of Rajasthan today. He is also celebrating his birthday today.
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as Deputy Chief Ministers of the state. pic.twitter.com/PREH1G4KB1
">#WATCH | Jaipur: BJP leader Bhajanlal Sharma to take oath as the new Chief Minister of Rajasthan today. He is also celebrating his birthday today.
— ANI (@ANI) December 15, 2023
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as Deputy Chief Ministers of the state. pic.twitter.com/PREH1G4KB1#WATCH | Jaipur: BJP leader Bhajanlal Sharma to take oath as the new Chief Minister of Rajasthan today. He is also celebrating his birthday today.
— ANI (@ANI) December 15, 2023
Diya Kumari and Prem Chand Bairwa will also be sworn in as Deputy Chief Ministers of the state. pic.twitter.com/PREH1G4KB1
-
#WATCH | Jaipur: Rajasthan CM-designate Bhajanlal Sharma took the blessing of Acharya Mridul Shastri ji ahead of the swearing-in ceremony today. pic.twitter.com/VfMFrI4Oci
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaipur: Rajasthan CM-designate Bhajanlal Sharma took the blessing of Acharya Mridul Shastri ji ahead of the swearing-in ceremony today. pic.twitter.com/VfMFrI4Oci
— ANI (@ANI) December 15, 2023#WATCH | Jaipur: Rajasthan CM-designate Bhajanlal Sharma took the blessing of Acharya Mridul Shastri ji ahead of the swearing-in ceremony today. pic.twitter.com/VfMFrI4Oci
— ANI (@ANI) December 15, 2023
ఎవరీ భజన్‌లాల్?
బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన నాలుగు సార్లు ఈ పదవిని చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో సంస్థాగతంగా కీలక వ్యవహరించిన భజన్‌లాల్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సాంగానెర్ నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 48వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. భజన్‌లాల్‌కు ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఏబీవీపీ నేతగా వ్యవహరించారు.
Rajasthan Election Result 2023 in Telugu : ఇటీవల జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 114 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని సొంతం చేసుకుంది. అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్ ఓటర్లు జై కొట్టడం వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 71 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు.
రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ- ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేకు పగ్గాలు
మార్పు కోరుకున్న రాజస్థాన్- బీజేపీకే పట్టం- కాంగ్రెస్‌ను ముంచిన వర్గవిభేదాలు!