ETV Bharat / bharat

ఫ్లైట్​లో వచ్చి బైక్​ల చోరీ- ఓఎల్​ఎక్స్​లో దందా! - బైక్ చోరీ బెంగళూరు

ఓఎల్​ఎక్స్​లో ఉన్న ధ్రువపత్రాలను ఉపయోగించి, తప్పుడు పేపర్లు తయారు చేసి.. మళ్లీ ఆ వేదిక ద్వారానే బైక్​లను విక్రయిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బైక్​లు అమ్మగా వచ్చిన డబ్బును జల్సాలకు వెచ్చించేవారని తెలిపారు.

Rajasthan-based Gang Arrested
ఫ్లైట్​లో వచ్చి బైక్​ల చోరీ
author img

By

Published : Jul 31, 2021, 12:49 PM IST

బైకుల హ్యాండిళ్లు విరగొట్టి.. అమాంతం దొంగతనం చేసేస్తారు. చోరీ చేసిన బైకులకు పోలీస్ నేమ్​ప్లేట్ తగిలించి సులభంగా వేరే చోటుకు తరలిస్తారు. ఓఎల్ఎక్స్​లో కస్టమర్లు అప్​లోడ్ చేసే బైకుల ధ్రువపత్రాల ఆధారంగా నకిలీ పత్రాలు తయారు చేస్తారు. అంతే, బైక్​ను తక్కువ ధరకు విక్రయిస్తారు. బెంగళూరులో రాజస్థాన్​కు చెందిన కొందరు యువకులు డబ్బు కోసం చేస్తున్న దందా ఇది.

Rajasthan-based Gang Arrested for stealing bikes
నిందితులు

రాజస్థాన్​కు చెందిన వికాస్ కుమార్, ధవల్ దాస్, దశరథ్​లు బెంగళూరులోని ఓ మెకానిక్, హార్డ్​వేర్ షాప్​లో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి అనేక ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటన్నింటినీ తీసుకెళ్లి ఆంధ్రహళ్లి ప్రాంతంలో పార్క్ చేసేవారు. తక్కువ ధరకు ఒక్కొక్కటిగా బైకులను విక్రయించారు.

చోరీ చేస్తుండగా సీసీటీవీలో నమోదైన దృశ్యాలు

బైకులు విక్రయించగానే రాజస్థాన్​కు వెళ్లిపోతారు. అక్కడికి వెళ్లి విలాస జీవితం గడుపుతారు. డబ్బులు అయిపోతే మళ్లీ చోరీని ముందేసుకుంటారు. బెంగళూరుకు వచ్చి తమ చోరకళను ప్రదర్శిస్తారు. రాజస్థాన్ నుంచి బెంగళూరు మధ్య వీరంతా విమానాలలో వచ్చి వెళ్తారంటే.. వీరి భోగాలు అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైక్​లు

.

ఓఎల్ఎక్స్ రిజిస్ట్రేషన్

చోరీ చేసిన బైక్​లకు పత్రాలు తయారు చేసేందుకు ఓఎల్​ఎక్స్​ను ఉపయోగించుకున్నారు ఈ నిందితులు. వేరే కస్టమర్లు అప్​లోడ్ చేసిన బండి కాగితాలను ఆధారంగా చేసుకొని ఫోర్జరీకి పాల్పడేవారు. నకిలీ ఆర్​సీ బుక్​లు తయారు చేసి.. చోరీ చేసిన బైక్​లను ఓఎల్​ఎక్స్​లోనే విక్రయించేవారని పోలీసులు తెలిపారు.

సులభంగా రవాణా చేసేందుకు బైక్​లపై పోలీస్ నేమ్​ప్లేట్​ను తగిలించేవారు. ఓ రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​కు ఏకంగా సబ్ ఇన్​స్పెక్టర్ అన్న పేరునే జత చేశారు. లాక్​డౌన్ సమయంలో బైక్​లను ఆపకుండా ఉండేందుకు ఇలా చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను బెంగళూరు కామాక్షిపలియా పోలీసులు అరెస్టు చేశారు. 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: భారత్‌-చైనా మధ్య 12వ విడత చర్చలు షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.