Rajasthan Assembly Election 2023 Results in Telugu : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ జోరు కనబరుస్తోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు, ఫలితాల్లో కాంగ్రెస్ డీలా పడింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వసుంధర టాప్- పుంజుకున్న పైలట్
ఝాల్రాపాటన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజస్థాన్ బీజేపీ అగ్రనేత వసుంధర రాజె ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌లాల్ చౌహాన్‌పై భారీ తేడాతో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు, టోంక్ స్థానం నుంచి తొలుత వెనకబడ్డ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్రమంగా పుంజుకున్నారు. తన సమీప అభ్యర్థి, బీజేపీ నేత అజిత్ సింగ్ మెహతాపై ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధిక్యంలో ఉన్నారు. సర్దార్పుర్ నుంచి ఆయన పోటీ చేశారు.
రాజస్థాన్ యోగి లీడింగ్
వసుంధర రాజెకు పోటీగా బరిలోకి దించినట్లు భావిస్తున్న బీజేపీ నేత దియా కుమారి లీడింగ్‌లో ఉన్నారు. విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై ఆధిక్యం కనబరుస్తున్నారు. 'రాజస్థాన్ యోగి ఆదిత్యనాథ్'గా పిలుస్తున్న బాబా బాలక్‌నాథ్ సైతం లీడింగ్‌లో కొనసాగుతున్నారు. తిజారా స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు.
ఫలితాలు దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే సాగుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్‌లో విజయం బీజేపీదేనని అంచనా వేశాయి. జన్‌కీ బాత్, రిపబ్లిక్ టీవీ, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ ఈటీజీ వంటి సంస్థలు బీజేపీకి 95 నుంచి 130 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు 56-106 మధ్య సీట్లు రావొచ్చని వివిధ ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి.
'ఈ ఫలితాలు మోదీ వల్లే'
రాజస్థాన్‌లో భారీ మెజారిటీతో బీజేపీ గెలుపొందుతుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ పేర్కొన్నారు. మేజీషియన్(గహ్లోత్) మ్యాజిక్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ప్రజలు వాస్తవాలను చూసి ఓటేశారని తెలిపారు. 'ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కూడా బీజేపీ విజయం సాధిస్తుంది. పేద ప్రజల జీవితాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన మార్పే ఈ ఫలితాలకు కారణం' అని శెఖావత్ పేర్కొన్నారు.
-
#WATCH | Jaipur, Rajasthan: Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "I have been saying from day one that the BJP will get a huge majority. BJP will win in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan. This is due to the work done by PM Modi to bring change in… pic.twitter.com/qbwzCdJQEQ
— ANI (@ANI) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jaipur, Rajasthan: Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "I have been saying from day one that the BJP will get a huge majority. BJP will win in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan. This is due to the work done by PM Modi to bring change in… pic.twitter.com/qbwzCdJQEQ
— ANI (@ANI) December 3, 2023#WATCH | Jaipur, Rajasthan: Union minister and BJP leader Gajendra Singh Shekhawat says, "I have been saying from day one that the BJP will get a huge majority. BJP will win in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan. This is due to the work done by PM Modi to bring change in… pic.twitter.com/qbwzCdJQEQ
— ANI (@ANI) December 3, 2023
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ మేజిక్- కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు!!