Collision Of Two Cars Accident: రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన అర్బాజ్ (16), వసీం (16), పర్వేజ్ (17), ఆలం (21), ఆసిఫ్‌గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎస్‌యూవీని ఢీకొట్టడం వల్ల బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులంతా ఖండేల్వా గ్రామానికి వెళ్తున్నట్లు చెప్పారు.
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున కూలీలపై దూసుకెళ్లిన లారీ.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి ఓ లారీ దూసుకెళ్లిన ఘటన హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో జరిగింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అశోద టోల్ ప్లాజా సమీపంలో జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 18 మంది కూలీలు పని చేస్తున్నారు. వారిలో 14 మంది పని అనంతరం విరామం కోసం సమీపంలోని ఫుట్‌పాత్‌పై సేదతీరారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న ఓ లారీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
ఇవీ చదవండి: రైల్వే పోలీసు చాకచక్యం.. పడబోతున్న ప్రయాణికుడిని..