ETV Bharat / bharat

'రైల్వే, వాయుసేన సాయంతో ఆక్సిజన్​ సరఫరా'

కొవిడ్ ఉద్ధృతి కారణంగా మెడికల్ ఆక్సిజన్​ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు రైల్వే, వైమానిక దళం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్​లను బ్లాక్​ మార్కెట్​లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

narendra modi
ప్రధాని మోదీ
author img

By

Published : Apr 23, 2021, 4:01 PM IST

మెడికల్ ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలకు యుద్ధప్రాతిపదికన రైల్వే, వైమానిక దళం ద్వారా ఆక్సిజన్​ ట్యాంకులను సరఫరా చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దేశంలో కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఔషధాలను, ఆక్సిజన్​ను సమకూర్చుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్​లను బ్లాక్​ మార్కెట్​లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

"కలిసికట్టుగా ఉండటం వల్లే మొదటి దశలో​ కరోనాను భారత్ జయించింది . ఇప్పుడు కూడా అదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ఈ విషయంలో కేంద్రం మద్దతు పూర్తిగా ఉంటుంది. అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్​లను బ్లాక్​ మార్కెట్​లో అమ్మేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు, గ్యాస్​ లీకేజీలు లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి."

-- నరేంద్ర మోదీ, ప్రధాని

కరోనా​పై ప్రభుత్వ యంత్రాంగాలు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలన్నారు మోదీ. తద్వారా.. ప్రజలు అనవసర భయాందోళనలకు గురికాకుండా ఉంటారని చెప్పారు.

ఇదీ చదవండి : 'ప్రాణాలు పోతున్నా ఆక్సిజన్​ ఉత్పత్తి చేయరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.