Railway Ticket Concession : రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొవిడ్‌కు ముందు సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్‌పై ఇచ్చిన రాయితీలను పునురుద్ధరణపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సమాధానమిచ్చారు.
కొవిడ్‌కు ముందు సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్‌పై ప్రభుత్వం 50శాతం రాయితీ ఇచ్చేది. 2020 మార్చి 20 తర్వాత దేశంలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధించింది. అప్పటి నుంచి వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. లాక్డౌన్ తర్వాత రైళ్లు నడిచినా ఆ రాయితీలను కేంద్రం పునరుద్ధరించలేదు. అనేకసార్లు రైల్వే రాయితీ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తినా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తటస్థ వైఖరిని ప్రదర్శించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్‌పై రాయితీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా స్పందించారు. ' ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలు టికెట్‌కు రూ. 100 ఉంటే, రైల్వే రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ రూ. 55 రాయితీ ఇస్తోంది' అన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు టికెట్‌పై రాయితీని తొలగించడం వల్ల రైల్వే రూ.2,242కోట్ల లాభపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది.
ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్ కిట్
Bed Roll Kit For RAC Passengers In AC Trains : ఇటీవలే రైల్వే ఏసీ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ఆర్ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్ రైల్వే. ఆర్ఏసీ టికెట్ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్ రోల్ కిట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ చెప్పారు. ఈ కిట్‌లో ఒక బెడ్‌షీట్, దుప్పటి, టవల్‌తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్ కార్ ప్రయాణికులకు వర్తించదని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రైల్వే 'సూపర్' యాప్ - అన్ని సేవలు ఒకే చోట - ఇకపై టికెట్ బుకింగ్‌కు నో వర్రీస్!
రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ భార్యలు- అందరూ పెన్షన్‌కు అర్హులే: హైకోర్టు