Railway Recruitment: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, లెవల్ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వేలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల(ఆర్ఆర్బీ) పరిధిలో జరిగిన పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ.. రైల్వే శాఖకు నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు.
బిహార్‌లో పెద్ద ఎత్తున నిరసనలు..
RRB NTPC: రైల్వే రిక్రూట్మెంట్పై అసంతృప్తితో దేశంలోని పలు చోట్ల అభ్యర్థులు.. నిరసనలు చేపట్టారు. బిహార్‌లో రైల్వే ట్రాక్‌లపై చేరి ఆందోళనలు చేశారు. కొన్ని చోట్ల హింస చెలరేగింది.
నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు.. లాఠీఛార్జి కూడా చేశారు.
ఈ నేపథ్యంలో.. నిరసనల సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డవారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవారిని భవిష్యత్తులో ఎంపిక చేయబోమంటూ రైల్వే శాఖ హెచ్చరించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి: పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన బంగాల్ మాజీ సీఎం