Rahul Satyapal Malik Interview : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ రెండింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు సత్యపాల్ మాలిక్ . ఈ వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
-
क्या ये संवाद ED-CBI की भाग दौड़ बढ़ा देगा?
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
पुलवामा, किसान आंदोलन और अग्निवीर जैसे महत्वपूर्ण मुद्दों पर राज्यपाल, पूर्व सांसद और किसान नेता, सत्यपाल मलिक जी के साथ दिलचस्प चर्चा!
पूरा वीडियो मेरे यूट्यूब चैनल पर देखिए। pic.twitter.com/tIGkXDRjzD
">क्या ये संवाद ED-CBI की भाग दौड़ बढ़ा देगा?
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2023
पुलवामा, किसान आंदोलन और अग्निवीर जैसे महत्वपूर्ण मुद्दों पर राज्यपाल, पूर्व सांसद और किसान नेता, सत्यपाल मलिक जी के साथ दिलचस्प चर्चा!
पूरा वीडियो मेरे यूट्यूब चैनल पर देखिए। pic.twitter.com/tIGkXDRjzDक्या ये संवाद ED-CBI की भाग दौड़ बढ़ा देगा?
— Rahul Gandhi (@RahulGandhi) October 25, 2023
पुलवामा, किसान आंदोलन और अग्निवीर जैसे महत्वपूर्ण मुद्दों पर राज्यपाल, पूर्व सांसद और किसान नेता, सत्यपाल मलिक जी के साथ दिलचस्प चर्चा!
पूरा वीडियो मेरे यूट्यूब चैनल पर देखिए। pic.twitter.com/tIGkXDRjzD
"ఆర్టికల్ 370 రద్దు కన్నా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించడమే స్థానికుల మనసులను అధికంగా గాయపరిచింది. ఆ అభిప్రాయంతో ఏకీభవించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో ఈ విషయాన్ని గుర్తించారు. జమ్ముకశ్మీర్ సమస్యను సైనిక బలంతో పరిష్కరించలేరు. ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏదైనా సాధించగలరు"
-- సత్యపాల్ మాలిక్, కశ్మీర్ మాజీ గవర్నర్
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుందని సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ప్రధాని మోదీ అధికార వ్యామోహంతో ఉన్నారని విమర్శించారు. ప్రతి చిన్న విషయాన్నీ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని ఆక్షేపించారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికులకు నివాళులర్పించేందుకు ప్రధాని.. శ్రీనగర్‌కు వెళ్లి ఉండాల్సిందని మాలిక్ అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేంద్రంలోని బీజేపీని గద్దె దించకపోతే.. రైతుల స్థానంలో కార్పొరేట్లను ప్రవేశపెడుతుందని ఆరోపించారు. రోజురోజుకూ పేదలుగా మారడం వల్ల రైతుల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని అన్నారు. కనీసం ఎంపిక చేసిన పంటలకైనా కనీస మద్దతు ధర అమలు చేయాలని సత్యపాల్ మాలిక్ డిమాండ్ చేశారు. "వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత, ప్రభుత్వం కనీస మద్దతు ధర హామీ ఇచ్చింది. కానీ ప్రయోజనం లేదు. అదానీ కంపెనీ తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి.. పెంచిన ధరలకు విక్రయిస్తోంది" అని ఆరోపించారు.
సెంట్రల్ యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో బంధుప్రీతి ఉందని సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. గత ఏడాది కాలంలో నియమితులైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల వీసీలు ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్నారని ఆయన అన్నారు. మణిపుర్లో నెలకొన్న ఉద్రిక్తత.. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యమే తెలిపారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా నేను గళం విప్పిన వారిలో ఎవరినీ విచారించకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
సత్యపాల్ మాలిక్ సహాయకుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో..