ETV Bharat / bharat

'ధర్మ సంసద్'​లో విద్వేష ప్రసంగం- రాహుల్​, ప్రియాంక ఫైర్​

Haridwar hate speech: హరిద్వార్​లో నిర్వహించిన ధర్మ సంసద్​లో పలువురు విద్వేష ప్రసంగాలు చేశారు. ఇందుకు సంబంధించి జితేంద్ర నారాయణ్​ త్యాగిపై కేసు నమోదైంది. దీనిపై స్పందించిన కాంగ్రెస్​ నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ.. విద్వేషాలు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. హిందుత్వవాదులే ఇలా చేస్తారని రాహుల్ విమర్శించారు.

hate speeches at Haridwar, rahul, priyanka
ధర్మ సంసద్​లో విధ్వేష ప్రసంగం- రాహుల్​, ప్రియాంక ఫైర్​
author img

By

Published : Dec 24, 2021, 8:52 PM IST

Haridwar hate speech: ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో ఇటీవల జరిగిన ధర్మ సంసద్​లో జితేంద్ర నారాయణ్​ త్యాగి విద్వేష ప్రసంగం చేశారు. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇందుకు సంబంధించి ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్​ 153ఏ కింద జితేంద్రపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు కోత్వాలి పోలీస్ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ రకీందర్ సింగ్ తెలిపారు. సమాజంలో వర్గాలు, కులాలు, భాష, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తిస్తే ఈ సెక్షన్​ కింద అభియోగాలు మోపుతామన్నారు.

జితేంద్ర త్యాగి ఇటీవలే తన మతం మార్చుకున్నారు. వసీం రిజ్వీ పేరు తీసి త్యాగిగా మారారు.

హరిద్వార్​ జ్వాలాపుర్ ప్రాంతానికి చెందిన గోఖలే చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను అతను ట్విట్టర్​లో షేర్ చేశాడు. డిసెంబర్​ 27లోగా ధర్మ సంసద్​ నిర్వాహకులను అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విద్వేష ప్రసంగం తీవ్రంగా ఉందని తెలిపాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కొన్ని వర్గాల వారిపై దాడులు చేయాలని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. పోలీసులు మాత్రం తమ వద్ద ఎలాంటి వీడియోలు లేవని చెప్పారు.

Dharma Sansad hate speech

ఈ ధర్మసంసద్​ను డిసెంబర్​ 17నుంచి 20 మధ్య జునా అఖండకు చెందిన యాతి నరసింహానంద్​ గిరి ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఓ వర్గంపై హింసకు పాల్పడాలని గతంలో చేసిన విద్వేష ప్రసంగాల వల్ల పోలీసులు ఆయనపై ఇప్పటికే నిఘా వహిస్తున్నారు.

ఈ సమావేశంలో ఓ వర్గంవారిపై దాడి చేయాలని, ఆయుధాలతో అందుకు సిద్ధం కావాలని, మాజీ ప్రధానిని చంపాలని పలువురు ప్రసంగించారు.

Rahul gandhi hate speech

రాహుల్​ ఫైర్..

ధర్మ సంసద్​లో విద్వేష ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. హిందుత్వవాదులే ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేసి సమాజంలోని వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తారని ధ్వజమెత్తారు. దాని వల్ల అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్వీట్ చేశారు. భారత్​ హిందుత్వవాదానికి, హింసకు వ్యతిరేకమని.. ఇలాంటివి జరగవని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను చేసే వారిని ఉపేక్షించవద్దన్నారు.

Haridwar Dharma Sansad

ప్రియాంక డిమాండ్​...

విద్వేషం, హింసను వ్యాప్తి చేయాలని చూసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్​ చేశారు. మాజీ ప్రధాని సహా ఇతర వర్గాల వారిపై దాడి చేయాలని ప్రచారం చేసే వారిని వదిలిపెట్టొద్దని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ప్రజలకు కేంద్రం హెచ్చరిక- అనేక రాష్ట్రాల్లో నైట్​ కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.