ETV Bharat / bharat

'పేదలను విస్మరించి.. బడా కార్పొరేట్లకే మోదీ సాయం' - కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పేదలను విస్మరించి బడా కార్పొరేట్లకు మాత్రమే సాయపడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే పేదలకు నేరుగా డబ్బు పంపిణీ చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు.

rahul gandhi on pm modi, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ
రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 1, 2021, 7:36 PM IST

లక్షలాది మంది పేద ప్రజలకు సాధికారత కల్పించకుండా.. పెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రధాని మోదీ సాయం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. వ్యాపారవేత్తల చేతిలో డబ్బు పెడితే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని ప్రధాని భావిస్తున్నారని.. కానీ వారు ఆ డబ్బు తీసుకుని పరారవుతున్నారని ఎద్దేవా చేశారు. వయనాడ్​లో గురువారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేరళలో అధికారంలోకి వస్తే.. న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామన్నారు.

"కేరళ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి న్యాయ్​ పథకాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఈ పథకం ద్వారా కేరళలో ఉన్న పేదల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెల రూ.6000 డిపాజిట్​ చేస్తాం. పేదలకు డబ్బు పంపిణీ చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని నేను భావిస్తాను. ఈ ప్రాంతం ఒక్కప్పుడు సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ఇప్పుడు కూడా మనం ఆ స్థాయిని చేరుకోవచ్చు. కానీ ఇవన్నీ సాధ్యం కావాలంటే రాష్ట్రంలో మేం అధికారంలోకి రావడం ఒక్కటే మార్గం."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

లెఫ్ట్​ పార్టీలతో..

కేరళలో ఉన్న సమస్యలపై తాను లెఫ్ట్​ పార్టీలతో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు రాహుల్. ఇరు పక్షాల సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా ఈ సమయంలో చర్చలు జరపడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : వాజే కేసు: హోటల్​లో ఎన్​ఐఏ తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.