అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆ రాష్ట్రంలో నేడు పర్యటించనున్నారు. కళాశాల విద్యార్థులు, తేయాకు తోటల్లో పనిచేసేవారిని కలిసి మాట్లాడనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం తీస్సుఖియా జిల్లాలోని దూమ్ ధూమా ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నట్లు వివరించాయి.
" అసోం పర్యటనలో మీ అందరిని కలవటం కోసం ఎదురుచూస్తున్నా. మనల్ని వేరు చేసే శక్తులను కలిసి ఓడిద్దాం. దృఢమైన, శాంతియుత, సంయుక్త అసోంను నిర్మించేందకు కృషి చేద్దాం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
అసోంలో రాహుల్ గాంధీ శుక్రవారం చేసే పర్యటన రెండోది కానుంది. ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం అసోంలో పర్యటించారు. తేయాకు తోటల్లో పనిచేసేవారితో మాట్లాడారు.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి : అసోంలో రెబల్స్‌కు భాజపా షాక్