వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News). 'ఈవెంట్ ముగిసింది' అని ట్వీట్(Rahul Gandhi Tweet) చేశారు.
శుక్రవారం.. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో(Vaccination Record India) వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్కరోజే 2. 5 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్(Rahul Gandhi News Today) వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
-
Event ख़त्म! #Vaccination pic.twitter.com/S1SAdjGUA2
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Event ख़त्म! #Vaccination pic.twitter.com/S1SAdjGUA2
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2021Event ख़त्म! #Vaccination pic.twitter.com/S1SAdjGUA2
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2021
గత 10 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉందో తెలిపే కొవిన్ వెబ్సైట్ గ్రాఫ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్ గాంధీ. రికార్డు పంపిణీ అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతలా పడిపోవడమేంటని ప్రశ్నించారు.
శుక్రవారంతో పోల్చితే శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తారని భావించినట్లు రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. 2.1 కోట్ల డోసులు మళ్లీ ఎప్పుడిస్తారో అని వేచిచూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థాయిలో టీకాల పంపిణీ జరగడం చాలా అవసరమని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:
Rahul Gandhi news: 'భాజపా-ఆర్ఎస్ఎస్ నేతలు హిందువులే కాదు'
Vaccination In India: దేశంలో 80 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ