కేరళలో పర్యటిస్తూ మత్స్యకారులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మమేకమవుతున్నారు. కొల్లాం జిల్లాలోని థంగసేరి బీచ్లో బుధవారం(ఫిబ్రవరి24న) చేపలు పట్టిన రాహుల్.. మత్స్యకారులతో కలిసి సముద్రంలో ఈత కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మత్స్యకారులకు సంబంధించి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలని డిమాండ్ చేశారు రాహుల్. గత నెలలో పుదుచ్చేరి పర్యటనలో కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం వల్ల పలువురు కేంద్రమంత్రులు.. రాహుల్పై విమర్శలు చేశారు.
ఇదీ చూడండి: లైవ్: పుదుచ్చేరిలో విద్యార్థులు, మత్స్యకారులతో రాహుల్ భేటీ