కరోనా వ్యాప్తి దృష్ట్యా బంగాల్‌లో తలపెట్టిన అన్ని ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రకటించారు. బహిరంగ సభల వల్ల కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందన్న ఆయన... దీని గురించి రాజకీయ నాయకులు లోతుగా ఆలోచించాలని ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు.
"కొవిడ్ నేపథ్యంలో బంగాల్‌లో నా ప్రచార ర్యాలీలన్నీ రద్దు చేస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆలోచించాలని రాజకీయ నాయకులకు కోరుతున్నా."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
బంగాల్‌లో మరో 3 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. కరోనా విజృంభణ కారణంగా వాటిని ఒకే విడతలో నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. కాగా, దేశంలో ఒక్కరోజే 2,61,500 కేసులు వచ్చాయి.మరో 1501 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: 'దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి'