ETV Bharat / bharat

'పంజాబ్​ సీఎం అభ్యర్థిని నిర్ణయించేది కార్యకర్తలే'

Rahul Gandhi Punjab: పంజాబ్​లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ కార్యకర్తలేని తెలిపారు రాహుల్​ గాంధీ. ​వారిని సంప్రదించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు.. పార్టీలో విబేధాలున్నాయన్న వార్తలను కొట్టిపారేస్తూ.. రాహుల్​ గాంధీ సమక్షంలో సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ ఆలింగనం చేసుకుని తాము ఐక్యంగా ఉన్నట్లు చాటి చెప్పారు.

Rahul Gandhi Punjab
Rahul Gandhi Punjab
author img

By

Published : Jan 27, 2022, 6:41 PM IST

Updated : Jan 27, 2022, 7:44 PM IST

Rahul Gandhi Punjab: పంజాబ్​ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పంజాబ్​లో పర్యటించారు రాహుల్​. ఈ సందర్భంగా జలంధర్​లో 'నవీ సోచ్​ నవా పంజాబ్'​ పేరుతో నిర్వహించిన వర్చువల్​ ర్యాలీలో మాట్లాడారు​.

"కాంగ్రెస్​ కార్యకర్తలు కోరుకుంటే.. పంజాబ్​ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకుంటాం. కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే సీఎం అభ్యర్థిపై వస్తున్న డిమాండ్ నెరవేరుతుంది. మహిళల కోసం ప్రత్యేకమైన మేనిఫెస్టో సిద్ధం చేయాలని సీఎం చన్నీ, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు చెప్పాను. పంజాబ్​లో ఎవరు ముఖ్యమంత్రి అయినా.. మరో వ్యక్తి ఆయనకు మద్ధతు ఇస్తామని సీఎం చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు సిద్ధూ నాకు మాట ఇచ్చారు. సీఎం అభ్యర్థిని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. ​ "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

చన్నీ, సిద్ధూల ఆలింగనం..

పంజాబ్‌ కాంగ్రెస్‌లో విభేదాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన.. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వేదికపై ఉండగానే పంజాబ్ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్ సిద్ధూను పిలిచి, చన్నీ ఆలింగనం చేసుకున్నారు. సిద్ధూకు తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని, పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా ఐక్యంగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

  • There is no fight between us. Announce chief minister face for Punjab polls, we (Punjab Congress) will stand united: Punjab CM Charanjit Singh Channi said during a gathering where Congress leader Rahul Gandhi was also present pic.twitter.com/c3tkX5S408

    — ANI (@ANI) January 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్వర్ణ దేవాలయాన్ని దర్శించిన రాహుల్​..

పంజాబ్​ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆ రాష్ట్రంలోని స్వర్ణ దేవాలయం దర్శనంతో ప్రారంభించారు. ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ, పీసీసీ చీఫ్​ నవజోత్​ సింగ్​ సిద్ధూలతో కలిసి అమృత్​సర్​లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన రాహుల్​.. అక్కడ నిర్వహించిన లంగర్​లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ బలప్రదర్శనలో భాగంగా 117 మంది అభ్యర్థులతో దుర్గియానా మందిర్​, భగవాన్​ వాల్మికీ తీరథ్​ స్థల్​లను సందర్శించారు.

Rahul Gandhi Punjab:
అల్పాహారం స్వీకరిస్తున్న రాహుల్​
Rahul Gandhi Punjab
కాషాయ వస్త్రం తలకు చుట్టి.. రాహుల్​ ఎన్నికల ప్రచారం

నల్ల రిబ్బన్లతో నిరసన..

రాహుల్​ పర్యటన నేపథ్యంలో అమృత్​సర్​లో వాల్మీకీ వర్గానికి చెందిన పలువురు నిరసన వ్యక్తం చేశారు. చన్నీ వాల్మీకీలకు వ్యతిరేకం అని ఆరోపించారు. నల్ల రిబన్లతో ఆందోళనకు దిగారు.

పంజాబ్​లో బహిరంగ ప్రదేశాల్లో ర్యాలీలు నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్​ నిషేధించిన తర్వాత ఆ రాష్ట్రంలో రాహుల్​ పర్యటించడం ఇదే తొలిసారి.

Rahul Gandhi Punjab visit
ఎన్నికలప్రచారంలో కాంగ్రెస్​ నేతలు
Rahul Gandhi Punjab
స్వర్ణదేవాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో రాహుల్
Rahul Gandhi Punjab
తలకు కాషాయ వస్త్రాన్ని చుట్టుకున్న రాహుల్​ గాంధీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : మహిళపై లైంగిక వేధింపులు- జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు!

Last Updated : Jan 27, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.