Rahul Gandhi Parliament Standing Committee : రక్షణశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎంపీ రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చిలో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోకముందు ఇదే కమిటీలో ఉన్న రాహుల్.. ప్రస్తుతం తిరిగి ఎంపికయ్యారు. ఈ కమిటీలోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా నామినేట్ అయినట్లు లోక్‌సభ బులిటెన్ వెల్లడించింది. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయినట్లు పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్ మొహమ్మద్.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారని తెలిపింది.
-
The Lok Sabha Speaker has nominated Congress MP Rahul Gandhi to the Standing Committee on Defence pic.twitter.com/woqPUFW6GC
— ANI (@ANI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Lok Sabha Speaker has nominated Congress MP Rahul Gandhi to the Standing Committee on Defence pic.twitter.com/woqPUFW6GC
— ANI (@ANI) August 16, 2023The Lok Sabha Speaker has nominated Congress MP Rahul Gandhi to the Standing Committee on Defence pic.twitter.com/woqPUFW6GC
— ANI (@ANI) August 16, 2023
Rahul Disqualification Supreme Court : మరోవైపు 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్లు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీలుకు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను జులై 7న న్యాయస్థానం కొట్టేసింది.
అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలు శిక్ష పడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. దీంతో వారి సభ్యత్వం రద్దవుతుంది. అంతేగాక, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికీ వీలుండదు. అనంతరం జులై 15న రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 4 తేదీన విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన్ను దోషిగా తేల్చడంపై స్టే విధించింది. ఫలితంగా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని.. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. ఈ తీర్పుతో అనర్హత ముప్పు నుంచి రాహుల్ బయటపడ్డారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ రాహుల్ పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.
'మణిపుర్ హింస వల్ల చాలా డిస్టర్బ్ అయ్యా.. విభజన రాజకీయాల ఫలితమే అది'
Rahul Gandhi Europe Trip : రాహుల్ గాంధీ యూరప్ టూర్!.. వారితోనే కీలక భేటీ