Rahul Gandhi Parliament Attendance : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం పార్లమెంట్‌లో వస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, శని, ఆది వారాలు పార్లమెంట్ ఉభయసభలకు సెలవు. దీంతో సోమవారం రాహుల్‌గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
-
वो आ रहे हैं... pic.twitter.com/NYTfIyOVBT
— Congress (@INCIndia) August 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">वो आ रहे हैं... pic.twitter.com/NYTfIyOVBT
— Congress (@INCIndia) August 6, 2023वो आ रहे हैं... pic.twitter.com/NYTfIyOVBT
— Congress (@INCIndia) August 6, 2023
Modi Surname Case Supreme Court : మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. దీంతోపాటు ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్ ముందు ఉంచారు. ఇక ఆయన సంతకం చేయడమే తరువాయి.. రాహుల్ సభలోకి వెళ్లేందుకు వీలుంటుంది. అయితే, రాహుల్ గాంధీ సోమవారమే సంతకం చేస్తారా లేదంటే కొంత సమయం తీసుకుంటారా? అనే దానిపై స్పష్టత రాలేదు.
Modi Surname Rahul Case : కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ గంధీపై అనర్హత వేటు వేసినంత వేగంగానే దానిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నాయని సమాచారం. ప్రతిపక్ష కూటమి 'ఇండియా' కూడా ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేందుకు సిద్ధం అవుతోంది. ఓ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడటం వల్ల లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌పై గత జనవరిలో లోక్‌సభ అనర్హత వేటు వేసింది. అయితే, ఆ శిక్షపై ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. అయినప్పటికీ లోక్‌సభ ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేయలేదు. అనంతరం ఫైజల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Modi Surname Controversy : కాగా, గత మార్చిలో దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా.. అంతకు ముందే ఆయనపై ఉన్న అనర్హత వేటును తొలగిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియకు దాదాపు నెల సమయం పట్టడం గమనార్హం. కానీ, రాహుల్ గాంధీ విషయంలో అంత సమయం పట్టకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం దీనికి అనుకూలంగా నిర్ణయం రాకపోతే మళ్లీ సుప్రీంను ఆశ్రయించాలని భావిస్తున్నాయి. 'మోదీ' ఇంటిపేరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ.. రాహుల్‌కు సూరత్ సెషన్స్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
'నేను నిర్దోషిని.. క్షమాపణ చెప్పను.. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతించండి!'
రాహుల్ పరువు నష్టం కేసు.. గుజరాత్ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు