ETV Bharat / bharat

విపక్ష నేతలతో రాహుల్​ భేటీ- టీఎంసీ దారెటు? - pegasus snooping

పెగసస్ వ్యవహారంపై మోదీ సర్కారును ఇరుకున పెట్టే విధంగా వ్యూహాన్ని రచించేందుకు విపక్ష పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. టీఎంసీ సహా అన్ని విపక్షాల ఎంపీలు, ఫ్లోర్ లీడర్లను అల్పాహార విందుకు ఆహ్వానించారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Aug 2, 2021, 3:53 PM IST

పార్లమెంట్​లో ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. దిల్లీలోని కాన్​స్టిట్యూషన్ క్లబ్​లో అల్పాహార విందుకు విపక్ష నేతలను ఆహ్వానించారు. మంగళవారం ఈ సమావేశం జరగనుంది.

పెగసస్ నిఘా వ్యవహారంపై సంయుక్త వ్యూహాన్ని రచించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సంబంధిత వ్యక్తులు తెలిపారు. వీటితో పాటు ఎన్​డీఏ సర్కారును ఇరుకున పెట్టేందుకు వివిధ అంశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా చర్చలు జరపనున్నట్లు చెప్పారు.

ఈ భేటీకి అన్ని విపక్ష పార్టీల ఎంపీలు, ఫ్లోర్ లీడర్లను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న అన్ని సమావేశాలకు గైర్హాజరు అవుతున్న టీఎంసీకి సైతం ఆహ్వానం అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్​లో రగడ

పెగసస్, ధర పెరుగుదల, సాగు చట్టాలు సహా వివిధ సమస్యలపై చర్చించాలని విపక్ష పార్టీలు పార్లమెంట్​లో ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై చర్చించేందుకు వీలుగా పార్లమెంట్​లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే, మోదీ సర్కారు మాత్రం.. పెగసస్ వ్యవహారం అసలు సమస్యే కాదని చెబుతోంది. ఐటీ మంత్రి ఇప్పటికే ఉభయ సభల్లో వివరణ ఇచ్చారని స్పష్టం చేసింది. అనవసరంగా ప్రతిపక్ష పార్టీలు సభలో ఆందోళనకు దిగుతున్నాయని అంటోంది.

ఇదీ చదవండి: 'ఆగస్ట్, సెప్టెంబర్​లో జోరుగా వర్షాలు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.