ETV Bharat / bharat

26 రఫేల్​ జెట్స్ కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ - భారత్​ ఫ్రాన్స్​ నేవీ రఫేల్

Rafale Navy India : భారత నౌకాదళం కోసం 26 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలతో పాటు మూడు స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటి కొనుగోలుకు సుమారు రూ.90 వేల కోట్లు అవుతున్నట్లు అంచనా.

Rafale Navy India
Rafale Navy India
author img

By

Published : Jul 13, 2023, 2:30 PM IST

Updated : Jul 13, 2023, 3:07 PM IST

Rafale Navy India : ఫ్రాన్స్​ నుంచి 26 రఫేల్​ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్​ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ కొనుగోళ్ల మండలి చేసిన ప్రతిపాదనలను రక్షణ శాఖ గురువారం ఆమోదించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి. దీంతో పాటు నాలుగు శిక్షణా విమానాలు సైతం భారత్​కు అందుతాయి.

సుమారు రూ.90వేల కోట్లు..
Indian Navy Rafale Deal : 26 రఫేల్​ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్​ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు సుమారు రూ.90 వేల కోట్లు అవుతున్నట్లు అంచనా. అయితే కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. వీటితోపాటు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ కంపెనీ.. భారత్‌కు చెందిన ఒక సంస్థతో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేసే అంశంపైనా ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • The Defence Acquisition Council has approved proposals for buying 26 Rafale fighter aircraft including 22 Rafale Ms and 4 twin seater trainer versions along with three additional Scopene class submarines for the Indian Navy: Defence officials pic.twitter.com/2LYl6m8W8v

    — ANI (@ANI) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కమిటీ ఏర్పాటు చేసి..
Rafale France India : అయితే భారత్.. ఈ ఒప్పందంలో ధరల రాయితీలను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం భారత్, ఫ్రాన్స్.. సంయుక్త చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీల్‌పై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాకే.. తుది నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పాయి.

గతేడాది డిసెంబరులో చివరగా..
Rafale Indian Navy : వాయుసేన కోసం భారత్‌ ఇప్పటి వరకు.. 36 రఫేల్‌ జెట్‌లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసింది. ఆ దేశ సహకారంతో భారత్‌లో ఇప్పటికే ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాములను నిర్మించింది. యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ రఫేల్ జెట్ గతేడాది డిసెంబర్​లో మన దేశానికి చేరుకుంది.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా
Modi France Visit 2023 : అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఫ్రాన్స్​ పర్యటనకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.

  • Leaving for Paris, where I will take part in the Bastille Day celebrations. I look forward to productive discussions with President @EmmanuelMacron and other French dignitaries.
    Other programmes include interacting with the Indian community and top CEOs. https://t.co/jwT0CtRZyB

    — Narendra Modi (@narendramodi) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Jul 13, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.