ETV Bharat / bharat

'క్యూఆర్-సామ్' క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీఓ - 'క్యూఆర్-సామ్' క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీఓ

దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) మంగళవారం ప్రయోగించిన 'క్యూఆర్-సామ్' క్షిపణి పరీక్ష విజయవంతమైంది. క్యూఆర్‌ సామ్‌ పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Quick Reaction Surface to Air Missile air defence system successfully testfired by DRDO today.
'క్యూఆర్-సామ్' క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్​డీఓ
author img

By

Published : Nov 17, 2020, 6:46 PM IST

Updated : Nov 17, 2020, 7:02 PM IST

సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా డీఆర్​డీఓ మంగళవారం ప్రయోగించిన 'క్యూఆర్-సామ్' క్షిపణి పరీక్ష విజయవంతమైంది. నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు సంస్థ ప్రకటించింది.

ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడి చేస్తుంది. శత్రుదేశ యుద్ధవిమానాల రాడార్ల జామింగ్‌కు వ్యతిరేకంగా ఎలక్ట్రానిక్ కౌంటర్ చర్యలతో ఇది పోరాడుతుంది. ఈనెల 13నే దీని సామర్థ్యాలను డీఆర్​డీఓ విజయవంతంగా పరీక్షించినప్పటికీ ఇవాల్టి పరీక్షలో క్షిపణిలోని వార్‌హెడ్ల పనితీరును పరీక్షించింది. క్యూఆర్‌ సామ్‌ పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్​డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు.

Last Updated : Nov 17, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.