ETV Bharat / bharat

కేపీఎస్​సీ పేపర్​ లీక్.. ఆరుగురు అరెస్ట్​ - Question paper leaked in banguluru

కర్ణాటకలో శనివారం జరగాల్సిన ఫస్ట్​ క్లాస్​ అసిస్టెంట్​ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో పరీక్షను ఈ నెల 24కు వాయిదా వేసింది కర్ణాటక పబ్లిక్​ సర్వీస్ కమిషన్​.

Question paper leaked: Tomorrow's FDA exam postponed, 6 arrested in Bengaluru
కేపీఎస్​సీ పేపర్​ లీక్.. ఆరుగురు అరెస్ట్​
author img

By

Published : Jan 23, 2021, 11:32 PM IST

కర్ణాటక పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(కేపీఎస్​సీ) నిర్వహించాల్సిన ఫస్ట్​ క్లాస్​ అసిస్టెంట్​(ఎఫ్​డీఏ)ని వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్​డీఏ పరీక్షాపత్రం ముందుగానే లీక్​ అయినట్లు గుర్తించారు. ఇందులో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Question paper leaked: Tomorrow's FDA exam postponed, 6 arrested in Bengaluru
కేపీఎస్​సీ నోటిఫికేషన్​

అనుకున్న షెడ్యూల్​ ప్రకారం పరీక్ష శనివారం జరగాల్సి ఉంది. కానీ లీకేజీ కారణంగా ఈ నెల 24న నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేపీఎస్​సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

కమిషనర్​ ట్వీట్

నిందితుల అరెస్టు

లీకేజ్​తో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీసీబీ జాయింట్​ కమిషనర్​ సందీప్​ పాటిల్​ ట్వీట్​ చేశారు. చంద్రు, రాజప్ప అనే ఇద్దరిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి పరీక్షాపత్రాలు, రూ. 24 లక్షల నగదు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆప్​ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలుశిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.