Pushpa movie seen repeat: ఒడిశాలోని భువనేశ్వర్‌లో అల్లు అర్జున్ సినిమా 'పుష్ప'లోని ఓ సీన్ రీపీట్ అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా ట్యాంకర్‌లో ఎర్రచందనాన్ని తరలించినట్లు కొందరు అక్రమ మద్యాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. ట్యాకర్కు పైన మంచి నీటి సరఫరా అని స్టిక్కర్ అతికించి లోపల మాత్రం మందును తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ట్యాంకర్‌ను సీజ్ చేశారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితులను పోలీసులు ఆదివారం భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో ఉన్న మహీధర్పుర్లో ఫిబ్రవరి 28 అర్ధరాత్రి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఓ వాటర్ ట్యాంకర్ ఆగి ఉండడం గమనించారు. ట్యాంకర్ మీద మంచి నీరు పంపిణీ అని రాసి ఉడడం చూసి అనుమానంతో తనిఖీ చేశారు. అందులో సుమారు 1,070 కేసులు మద్యాన్ని గుర్తించారు. ఇది మొత్తం 9225 లీటర్లు ఉంటుందని అంచనా వేశారు.
ట్యాంకర్‌లో దాచి ఉంచిన మద్యంపై ఎక్సైజ్ అధికారులు డ్రైవర్‌ను తమదైన శైలిలో ప్రశ్నించారు. బిజేంద్ర, హరియాణాకు చెందిన సతీష్ నందల్, అవినాష్ మోహరానాను అరెస్టు చేశారు. అసలు సూత్రధారుల కోసం ఎక్సైజ్ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు 11 రోజులుగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. భువనేశ్వర్ శివార్లలోని నౌగావ్‌కు చెందిన రాజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పుష్ప సినిమా చూసి.. ఈ రకమైన స్మగ్లింగ్‌కు నిందితుడు తెరతీసినట్లు అధికారులు తెలిపారు.
పుష్ప సినిమాకు సంబంధించిన కొన్ని స్మగ్లింగ్ వీడియోలు కూడా రాజ్‌కుమార్ ఫోన్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాజ్‌కుమార్ కుటుంబం ఇప్పటికే మద్యం, డ్రగ్స్ అక్రమ రవాణాలో ఆరితేరినట్లు తెలిపారు. రాజ్‌కుమార్ అసలు పేరు జగన్మోహన్ సాహు అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: