Punjab Man Wins Lottery : పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి గంట వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. లాటరీ టికెట్ కొన్న గంటలోనే అతడిని రూ.కోటి బంపర్ ప్రైజ్ వరించింది. అలవాటుగా గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నా ఎప్పుడూ తగల్లేదు. కానీ ఈసారి మాత్రం గంటలోనే లాటరీ గెలవడంపై అతడు సంతోషం వ్యక్తం చేశాడు.
ఇదీ జరిగింది..
Nagaland State Lottery Result : గురుదాస్‌పుర్ జిల్లా డేరా బాబా నానక్ టౌన్‌కు చెందిన రూపీందర్‌జిత్ సింగ్.. అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా రూ.6 చొప్పున నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అనంతరం బ్యాంకులో తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒక గంట సమయం తర్వాత.. 'మీరు రూ.కోటి గెలుచుకున్నారు' అని రూపీందర్‌జిత్‌కు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఒక గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. అయితే తన అలవాటే తనను ఇలా కోటీశ్వరుడిని చేసిందని రూపీందర్‌జిత్ తెలిపాడు.
రూపీందర్‌జిత్ రూ.కోటి లాటరీ గెలవడం వల్ల బ్యాంకు సిబ్బంది అతడికి అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులకు, స్నేహితులూ అభినందనలు తెలుపుతూ ఫోన్ కాల్స్ చేశారు. ఇదంతా చూస్తుంటే తన కల నిజమైనట్లు ఉందని రూపీందర్‌జిత్ అన్నాడు. తాను గెలిచిన రూ. కోటిని తన పిల్లలు, కుటుంబం భవిష్యత్ కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. అవసరం ఉన్న పేద ప్రజలకు కూడా సహాయం చేస్తానని అన్నాడు. అయితే, రూపీందర్ లాటరీ బంపర్ ప్రైజ్ గెలవడం వల్ల.. డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం యజమాని రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్‌ను గెలిచాడు.
రూ. 44 కోట్ల లాటరీ.. ప్రాంక్ అనుకుని నంబర్ బ్లాక్..
కర్ణాటకకు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వటక్కే కొరోత్ అనే వ్యక్తిని ఈ ఏడాది ఏప్రిల్‌లో అదృష్టం వరించింది. ఒక్క రోజులోనే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్‌తో.. ఏకంగా రూ.44 కోట్లు గెలుచుకున్నారు. అయితే అరుణ్ కుమార్‌కు లాటరీ గెలుచుకున్నారని ఫోన్ వస్తే దాన్ని ఆయన ప్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.