కాంగ్రెస్కు రాజీనామా చేసిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh news).. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీతో (Amarinder Singh new party) రాష్ట్ర ప్రజల ముందుకు రానున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, గుర్తుపై త్వరలోనే వివరాలు తెలియజేస్తానని తెలిపారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
అమిత్ షాతో భేటీ
సమయం వచ్చినప్పుడు అన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు కెప్టెన్ (Amarinder Singh latest news). పొత్తు కుదుర్చుకోవడం లేదంటే సొంతంగానే పోటీ చేస్తామని వివరించారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Sidhu vs Amarinder Singh) ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ తాము బలంగా పోరాడతామని అన్నారు. మరోవైపు, 25-30 మంది నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గురువారం కలవనున్నట్లు కెప్టెన్ వెల్లడించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు సమావేశమవుతున్నట్లు చెప్పుకొచ్చారు.
'హామీలు నెరవేర్చా..'
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తన హయాంలోనే నెరవేరాయని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను చేసిందేం లేదంటూ పలువురు నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. 92 శాతం హామీలు తన హయాంలోనే పూర్తయ్యాయని వివరించారు. తాను చేపట్టిన భద్రతా చర్యలను విమర్శించడాన్ని తప్పుబట్టారు.
"నేను సైనికుడిగా శిక్షణ తీసుకున్నా. సైన్యంలో పదేళ్ల పాటు పనిచేశా. శిక్షణ సమయం నుంచి.. ఆర్మీని వీడే వరకు నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి కనీస అంశాలు నాకు తెలుసు. మరోవైపు, పంజాబ్ హోంమంత్రిగా నేను 9.5 సంవత్సరాలు పనిచేశా. ఒక నెల హోంమంత్రి ఉన్న వ్యక్తి.. నాకంటే తనకే ఎక్కువ తెలుసని చెప్పుకుంటున్నారు. కల్లోలిత పంజాబ్ ఎవరికీ అవసరం లేదు. రాష్ట్రంలో కఠిన పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి."
-అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం
సిద్ధూ విమర్శలు
మరోవైపు, అమరీందర్ సింగ్ను భాజపా విశ్వాసపాత్రుడని నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎద్దేవా చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను నియంత్రిస్తోందని అన్నారు. స్వలాభం కోసం పంజాబ్ ప్రయోజనాలను విస్మరించారని వ్యాఖ్యానించారు. పంజాబ్ అభివృద్ధిని అడ్డుకునే శక్తి మీరేనంటూ కెప్టెన్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ పరిణామాలను ఊహించలేదని అన్నారు.
అమరీందర్ సింగ్ రాజీనామా (Amarinder Singh News) పంజాబ్ కాంగ్రెస్ వర్గాల్లో గందరగోళానికి దారి తీసింది. గత 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన అమరీందర్ సింగ్.. ఆ పార్టీలో ఎదుర్కొన్న అవమానాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: