ETV Bharat / bharat

'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో హింసాత్మక ఘటనల అనంతర పరిణామాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అరెస్ట్​పై (Priyanka Gandhi Latest News) ఆ పార్టీ నేత నవజోత్​ సింగ్​ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీని బుధవారంలోగా విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

priyanka gadhi latest news
'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్‌!
author img

By

Published : Oct 5, 2021, 9:08 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi Latest News) పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా ఆమెను (Priyanka Gandhi Latest News) విడుదల చేయాలని చేసి, నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పంజాబ్‌ నుంచి లఖింపుర్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యూపీ పోలీసులను హెచ్చరించారు.

"రైతుల దారుణ హత్యకు కారణమైన కేంద్రమంత్రి కుమారుడిని రేపటిలోగా అరెస్టు చేయాలి. అన్నదాతల కోసం పోరాడేందుకు వచ్చిన మా నాయకురాలు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi Latest News) చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఆమెను రేపటిలోగా విడుదల చేయాలి. లేదంటే పంజాబ్‌ కాంగ్రెస్‌ లఖింపుర్‌ ఖేరి వరకు మార్చ్‌ నిర్వహిస్తుంది" అని సిద్ధూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పర్యటన నేపథ్యంలో, ఆదివారం లఖింపుర్‌ ఖేరీలో హింస (Lakhimpur Kheri Incident) చెలరేగిన సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ అక్కడి తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఓ కారు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతులు జరిపిన దాడిలో మరో నలుగురు మృతిచెందారు. ఈ అల్లర్లలో ఓ విలేకరి కూడా ప్రాణాలు కోల్పోయారు. లఖింపుర్‌ ఖేరి ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని సీతాపూర్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సమీపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు.

రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు ఆశిష్‌ సహా కొందరిపై కేసు నమోదు చేశారు. అయితే ఆయనను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

భాజపా భారీ మూల్యం చెల్లించక తప్పదు: పవార్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో హింసాత్మక ఘటనల (Lakhimpur Kheri Incident) అనంతర పరిణామాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న బాధిత రైతు కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎంలు, ఎంపీలతో పాటు పలు రాజకీయ పార్టీల ముఖ్య నేతలను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. లఖింపుర్‌ ఖేరి ఘటన జలియన్‌వాలాబాగ్‌ నరమేధాన్ని తలపిస్తోందని ఎన్సీపీ అగ్రనేత, కేంద్రమాజీ మంత్రి శరద్‌ పవార్‌ అన్నారు. భాజపాకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని, ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్యానించారు. కేంద్రంతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించడంలేదన్నారు. యూపీలో జలియన్‌వాలాబాగ్‌ ఉదంతంలాంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. ప్రతిపక్షాలన్నీ రైతుల వెంటే ఉన్నాయని భరోసా ఇచ్చారు. భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు పవార్‌ డిమాండ్‌ చేశారు. భాజపా నేతలు సున్నితత్వంతో లేరని, రైతుల మరణం పట్ల సంతాపం తెలిపేందుకు కూడా వారు సిద్ధంగా లేరని ఆరోపించారు. లఖింపుర్‌ ఖేరిని సందర్శించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, సీఎంలను సైతం వెళ్లనీయకుండా అడ్డుకొంటున్నారని, ఇది వారి ప్రాథమిక హక్కులకు భంగంకలిగించడమేనని మండిపడ్డారు.

'చట్టం ముందు అంతా సమానమైతే ఇలా ఉంటుందా?'

మరోవైపు, కేంద్రం, యూపీ పాలకుల అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఉమ్మడి కార్యాచరణకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut Latest News) పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీకి ముందు రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. "రైతులను కారుతో ఢీకొట్టిన కేంద్రమంత్రి తనయుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక మాత్రం జైలులో ఉన్నారు. చట్టం ముందు అంతా సమానమైతే ఇలా ఉంటుందా?" అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల లఖింపుర్‌ ఖేరీని సందర్శించే అంశంపై చర్చించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి : 'లఖింపుర్'​ ఘటనపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.