ETV Bharat / bharat

3 అడుగుల ట్రాక్టర్​.. 35 కి.మీ. మైలేజీ.. ఇంటర్​ విద్యార్థి అద్భుత ప్రతిభ

Three Feet Tractor: పంజాబ్​కు చెందిన ఓ యువకుడు రూపొందించిన అతి చిన్న ట్రాక్టర్​ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి ఉన్న గుర్విందర్​ అనే ఇంటర్​ విద్యార్థి మూడు అడుగుల ట్రాక్టర్​ను తయారు చేశాడు.

Three Feet Tractor
Three Feet Tractor
author img

By

Published : May 21, 2022, 10:07 PM IST

Updated : May 22, 2022, 10:28 AM IST

Three Feet Tractor: పంజాబ్‌లో ఓ ఇంటర్‌ విద్యార్థి అతి చిన్న ట్రాక్టర్‌ను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బఠిండాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించిన గుర్విందర్‌ అనే యువకుడు మూడు అడుగుల ఎత్తు ఉన్న ట్రాక్టర్‌ను తయారు చేశాడు. అనంతరం సాధారణ ట్రాక్టర్‌ వలే దాన్ని నడిపి స్థానికుల మన్ననలను పొందాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న గుర్విందర్‌కు చిన్నప్పటి నుంచి ట్రాక్టర్లు అంటే అమితమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే చిన్న చిన్న మోటర్లను ఉపయోగించి ఇప్పటికే చాలా ట్రాక్టర్లను తయారు చేసినట్లు యువకుడు తెలిపాడు. ఈ క్రమంలోనే 3 అడుగుల ట్రాక్టర్‌ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నాడు.

Three Feet Tractor
గుర్విందర్​​ రూపొందించిన ట్రాక్టర్​
Three Feet Tractor
రూపొందించిన ట్రాక్టర్​తో గుర్విందర్​

"కొవిడ్​ లాక్​డౌన్​ సమయంలో కేవలం రూ.40 వేలతో ఈ ట్రాక్టర్​ను తయారు చేశాను. నేను రూపొందించిన ట్రాక్టర్​ లీటరుకు 35 కి.మీ మైలేజీ ఇస్తుంది. 4 క్వింటాళ్ల వరకు బరువును మోయగలదు. ట్రాక్టర్‌పై బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఫొటోలు దిగుతున్నారు"

- గుర్విందర్

తమ కుమారుడు అతి చిన్న ట్రాక్టర్​ తయారు చేయడం పట్ల చాలా సంతోషంగా ఉందని అతడి తండ్రి సాధు సింగ్ అన్నారు. తమ రోజువారీ పనిని మరింత సులభతరం చేసిందని ఆయన తెలిపారు.

Three Feet Tractor
మూడు అడుగుల ట్రాక్టర్​

ఇవీ చదవండి: పోలీస్​ స్టేషన్​కు నిప్పంటించిన దుండగులు.. కారణమదేనా?

ప్రేమకు ఓకే.. పెళ్లికి నో.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడిని..!

Last Updated : May 22, 2022, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.