పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ.. అమరీందర్‌పై నిరంతరం మాటల యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం.
అయితే.. పార్టీ బలపేతంపై చర్చించేందుకే సోనియాను కలిసినట్లు చెప్పారు అమరీందర్.
"సిద్ధూ గురించి మాట్లాడేందుకు నేను ఇక్కడకు రాలేదు. కేవలం పార్టీని బలపేతం చేసేందుకే సోనియాను కలిశాను. పార్టీ అంతర్గత విషయాలు, పంజాబ్ అభివృద్ధిపై చర్చించాం. పంజాబ్ విషయంలో సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం."
-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను సిద్ధూ కలిసిన కొద్ది రోజులకే అమరీందర్ సోనియా గాంధీతో సింగ్ సమావేశమవ్వడం గమనార్హం.
ఇవీ చదవండి: